బాలీవుడ్ ప్రేమ జంట అలియా భట్, రణ్‌బీర్ కపూర్ అతి త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. గత ఏడాది వీరి వివాహం జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా వలన వాయిదా పడింది. ఈ ఏడాది పక్కా జరుగుతుందని అందరు భావిస్తున్న నేపథ్యంలో కరోనా ఉదృతి కొనసాగుతుండగా, మళ్లీ అనుమానాలు నెలకొన్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం రణ్‌భీర్ కపూర్ కరోనా బారిన పడగా, ఈ విషయాన్ని ఆయన తల్లి సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. రణ్‌బీర్ కపూర్‌కు కరోనా అని తెలియగానే అలియా క్వారంటైన్‌కు వెళ్లింది. నాలుగు రోజుల తర్వాత పరీక్ష చేయించుకోగా నెగెటివ్ అని తేలింది.
వరుస షూటింగ్స్‌లో పాల్గొంటున్న నేపథ్యంలో అలియా భట్‌కు కూడా కరోనా సోకింది.

