
జైపూర్: కరోనాతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు బులియన్ వ్యాపారి. వ్యాపారం నడకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. తనకు అప్పిచ్చినవారు డబ్బుకోసం ఒత్తిడి తేవడంపోటు అవమానించారు. తాను ఇతరులకు ఇచ్చిన డబ్బు కూడా వసూలవడంలేదు. దీంతో మానసికంగా కుంగిపోయి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది.
జైపూర్‌లోని జమ్డోలీ ప్రాంతంలో ఉంటుంన్న యశ్వంత్ సోనీ బులియన్ మార్కెట్‌లో వ్యాపారం చేస్తుంటాడు. కరోనాతో వ్యాపారం నడువక అప్పులు పెరిగిపోయాయి. దీంతో అప్పుల వారి ఒత్తిడి పెరిగిపోయింది. అదే సమయంలో తాను మరొకరికి ఇచ్చిన డబ్బు వసూలు కావడం లేదు. దీంతో భార్య ఇద్దరు పిల్లలతో సహా శనివారం ఉదయం ఉరివేసుకున్నారు.
అయితే శనివారం సాయంత్రం సోనీ సోదరుడు అతని ఇంటికి రావడంతో అతసలు విషయం వెలుగులోకివచ్చింది. ఇంటి తలుపు తట్టినా ఎవ్వరూ స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు తలుపులు తెరిచి చూడగా, తండ్రీ కొడుకులు ఒక గదిలో ఉరి వేసుకొని ఉండగా, సోనీ భార్య ఆమె గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని విగతజీవిగా ఉన్నది.
ఇంట్లో పోలీసులకు ఓ లేఖ దొరికింది. అందులో తనకు అప్పులు పెరిగిపోయాయని, రాజేందర్ అనే వ్యక్తి అవమానించాడని పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతను ఎంత అప్పుచేశాడు, ఇతరులకు ఎంత అప్పు ఇచ్చాడనే విషయం దర్యాప్తుల తేలుతుందని, ప్రాథమికంగా అది రూ.కోటి వరకు ఉంటుందని తేలిందని డీసీపీ మనోజ్ చౌదరి వెల్లడించారు.