Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kasarla Padma | బీఆర్ఎస్ కౌన్సిలర్ కాసర్ల పద్మకు సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ కన్నీటి నివాళి

Kasarla Padma | బీఆర్ఎస్ కౌన్సిలర్ కాసర్ల పద్మకు సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ కన్నీటి నివాళి

Kasarla Padma | రాజన్న సిరిసిల్ల, మే 30( నమస్తే తెలంగాణ ):సిరిసిల్ల మున్సిపాలిటీ 26వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మకు మున్సిపల్ కౌన్సిల్ కన్నీటి నివాళి అర్పించింది.

ఈ మేరకు శనివారం సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది.

గుండెపోటుతో బీఆర్ఎస్ కౌన్సిలర్ కాసర్ల పద్మ శుక్రవారం ఉదయం హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మున్సిల్ కౌన్సిల్ సమావేశంలో మొదటగా కౌన్సిలర్ కాసర్ల పద్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మృతి కౌన్సిల్‌కు తీరని లోటు అని అభిప్రాయపడ్డారు. కౌన్సిలర్ పద్మ సంతాపకంగా సమావేశాన్ని నిర్వహించి అనంతరం సమావేశాన్ని జూన్ 3వ తేదీకి వాయిదా వేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana