Dailyhunt
కవర్ కాదు.. హెల్మెట్ ధరించండి.. సైబరాబాద్ పోలీసుల ట్వీట్

కవర్ కాదు.. హెల్మెట్ ధరించండి.. సైబరాబాద్ పోలీసుల ట్వీట్

హైదరాబాద్ : రోడ్డుప్రమాదాలను నిలువరించేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. బైక్ నడిపే వ్యక్తితో పాటు పిలియన్ రైడర్ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు ఆదేశించారు.

లేని యెడల రూ. 100 జరిమానా విధిస్తామని పోలీసులు తెలిపారు.

అయితే సైబరాబాద్ పరిధిలో ఓ మహిళ బైక్‌పై వెనుకాల కూర్చొని, తన తలకు ప్లాస్టిక్ కవర్‌ను చుట్టుకుంది. ఈ ఫోటోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. హెల్మెట్ ఫుల్ కవర్ అయి ఉండాలి అన్నారు కానీ కవర్ ని హెల్మెట్ లా వాడమనలేదు అని పోలీసులు ట్వీట్‌లో రాశారు. హెల్మెట్ పెట్టుకోండి.. సురక్షితంగా ఉండండి.. అని పోలీసులు సూచించారు.

ద్విచక్ర వాహనంపై వెళ్లే రైడర్‌తో పాటు వెనుకాల కూర్చొనే వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆ ఇద్దరూ హెల్మెట్ ధరించని యెడల చలాన్ జారీ చేస్తామన్నారు.

అయితే రైడర్‌తో పాటు వెనుకాల కూర్చున్న వ్యక్తి కూడా పలు ప్రమాదాల్లో చనిపోయిన ఘటనలు చూశాం. ఈ నేపథ్యంలో హెల్మెట్ ధరించాలనే నిబంధనను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు పోలీసులు తెలిపారు. మోటార్ వెహికల్ యాక్ట్ 1989 ప్రకారం.. హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే రూ. 100 జరిమానా విధిస్తున్నారు. ఇప్పుడు వెనుకాల కూర్చొనే వ్యక్తి హెల్మెట్ ధరించకపోయిన రూ. 100 జరిమానా విధిస్తూ చలాన్లు జారీ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

హెల్మెట్ ఫుల్ కవర్ అయి ఉండాలి అన్నారు కానీ కవర్ ని హెల్మెట్ లా వాడమనలేదు.

హెల్మెట్ పెట్టుకోండి. సురక్షితంగా ఉండండి. #RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/XuDRy01lhW

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana