Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kavya Kalyanram | కావ్య కళ్యాణ్‌రామ్‌-కాలభైరవ ప్రేమ ఎప్పుడు మొదలైంది..నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్తలు

Kavya Kalyanram | కావ్య కళ్యాణ్‌రామ్‌-కాలభైరవ ప్రేమ ఎప్పుడు మొదలైంది..నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్తలు

Kavya Kalyanram | కొంతకాలంగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన నటి కావ్య కళ్యాణ్‌రామ్‌, సంగీత దర్శకుడు, గాయకుడు కాలభైరవ ప్రేమ వ్యవహారానికి ఎట్టకేలకు అధికారిక ముద్ర పడింది.

గత కొన్ని రోజులుగా వీరిద్దరూ కలిసి కనిపించడంతో ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పటివరకు తమ రిలేషన్‌షిప్‌పై ఇద్దరూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తాజాగా సోషల్ మీడియా వేదికగా తమ ప్రేమను స్వయంగా వెల్లడించడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాలభైరవతో కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కావ్య కళ్యాణ్‌రామ్‌.. తన మనసులోని భావాలను ఎంతో అందంగా రాసుకొచ్చారు. కొంతమంది మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత మనం ఎంతో ప్రత్యేకమైన వాళ్లమనే భావన కలుగుతుందని, తన జీవితంలోకి కూడా అలాంటి వ్యక్తి వచ్చాడని ఆమె పేర్కొన్నారు.

కాలభైరవ తన జీవితంలోకి వచ్చిన తర్వాత సాధారణంగా గడిచే రోజులు కూడా ప్రత్యేకంగా మారిపోయాయని కావ్య తెలిపారు. ఆయన తన జీవితంలో ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చారని, తనను ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతురాలిగా భావించేలా చేశారని చెప్పుకొచ్చారు. ఇక ముందు కూడా ఇలాంటి ఎన్నో సంవత్సరాలు కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె తన పోస్టులో వెల్లడించారు. మరోవైపు కాలభైరవ కూడా కావ్యతో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ప్రేమను ఎంతో కవితాత్మకంగా వ్యక్తం చేశారు. కావ్యతో సమయం గడపడం కొండల ఒడ్డున కూర్చుని నీటి ప్రవాహాన్ని చూస్తున్నంత ప్రశాంతంగా అనిపిస్తుందని, ఆమెతో కలిసి చేసే ప్రతి పని ఎప్పటికీ ముగియకూడదనుకునే విహారయాత్రలా ఉంటుందని పేర్కొన్నారు.

కావ్యను మొదటిసారి కలిసినప్పుడు కొత్త వ్యక్తిని కలిసినట్లు అనిపించలేదని.. ఇంటికి తిరిగి వచ్చిన అనుభూతి కలిగిందని కాలభైరవ రాసుకొచ్చారు. జీవితాంతం కలిసి ఒకే ఇంట్లో ఉండబోతున్నామనే విషయాన్ని ఇప్పుడు అందరితో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.అయితే
కావ్య కళ్యాణ్‌రామ్‌, కాలభైరవల ప్రేమకథ ఎలా మొదలైందనే ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో నెలకొంది. అందుతున్న సమాచారం ప్రకారం.. కాలభైరవ తమ్ముడు శ్రీసింహ నటించిన 'ఉస్తాద్' సినిమాలో కావ్య హీరోయిన్‌గా నటించారు. ఆ చిత్రానికి కాలభైరవ పాటలు పాడటంతో పాటు సంగీతానికి సంబంధించిన పనుల్లోనూ భాగమయ్యారు. 'ఉస్తాద్' సమయంలోనే కావ్య, కాలభైరవల మధ్య పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం క్రమంగా స్నేహంగా.. ఆ తర్వాత ప్రేమగా మారిందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే తమ ప్రేమకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ జంట ఇప్పటివరకు వెల్లడించలేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana