Dailyhunt
కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ : ప్రజాపంపిణీ వ్యవస్థలో సమస్యలపై చర్చ

కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ : ప్రజాపంపిణీ వ్యవస్థలో సమస్యలపై చర్చ

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం (కేబినెట్‌ సబ్‌ కమిటీ) సోమవారం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ, రేషన్‌ డీలర్ల సమస్యలు, ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్ఠం తదితర అంశాలపై సుధీర్ఘ చర్చ జరిగింది. ఈ కేబినెట్‌ సబ్‌ కమిటీలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావు, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గం సమావేశంలో ప్రజాపంపిణీ వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్‌ కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana