
న్యూఢిల్లీ: సిఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కరోనా బాధితులకు అవసరమైన వైద్య సదుపాయాల సమాచారం అందించడం కోసం ఓ యాప్‌ను రూపొందించింది. ఢిల్లీలోని ఆస్పత్రుల వివరాలు, వైద్య సదుపాయాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. ఈ యాప్‌లో ఎప్పటికప్పుడు వివరాలను ఆప్‌డేట్ చేస్తారు. అయితే ఏదైనా ఆస్పత్రిలో బెడ్ ఖాళీగా ఉందని యాప్‌లో చూపించి, అక్కడకు వెళ్తే చేర్చుకోవడానికి ఆస్పత్రి సిబ్బంది నిరాకరిస్తే 1031కి ఫోన్ చేయొచ్చు .