Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేరళలో 'అసలేం జరిగింది'

కేరళలో 'అసలేం జరిగింది'

కేరళలో తాజాగా జరిగిన ఏనుగు విషాద ఉదాంతం యావత్‌ భారత దేశాన్ని కబలించివేస్తుంది. మనుషులను నమ్మి ఆకలితో వచ్చిన జంతువుపై తమ క్రూరమైన చర్యలతో అది మరణించేలా చేశారు కొందరు మానవత్వం లేని ఆకతాయిలు. కేరళలో ఆకలితో ఉన్న ఓ గర్బంతో ఉన్న ఏనుగుకు పైనాపిల్‌లో పేలుడు పదార్థాలు ఉంచి తినేలా చేసి నోటిలో పేలేలా చేశారు ఆ మృగాలు దీంతో తీవ్ర గాయాల పాలైన ఆ ఏనుగు దయనీయ పరిస్థితిలో గుండెను కలచివేసేలా మరణించింది. దీంతో పాటు ఆ ఏనుగు గర్బంలో ఉన్న మరో జీవి మరణానికి కారణమయ్యారు ఆ దుండగులు.

ఈ ఘటనపై యావత్‌ భారత దేశం తీవ్రంగా ఖండిస్తుంది. అయితే తాజాగా 'అసలేం జరిగింది' చిత్ర హీరో శ్రీరాంతో పాటు సినీ బృందం ఈ విషాద ఘటనపై తీవ్రంగా స్పందించింది.

రాను రాను మనుషుల్లో మానవత్వం ఏమైపోతుందని చిత్ర బృందం ప్రశ్నించింది. కేరళలో జరిగిన ఈ ఘటన మానవత్వానికి మచ్చ అని చిత్ర బృందం అన్నారు. ప్రజలు జంతువుల పట్ల ప్రేమను మాత్రమే చూపించాలని చిత్ర సభ్యులు కోరారు.

శ్రీరామ్‌ హీరోగా నూలేటి వీర రాఘవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అసలేం జరిగింది. తెలుగులో కొంత విరామ తర్వాత హీరో శ్రీరామ్‌ నటిస్తున్న చిత్రం అసలేం జరిగింది. ఈ చిత్రంలో శ్రీరామ్‌ సరసన కన్నడ భామ సంచితా పదుకునే నాయికగా నటిస్తోంది. ఎక్సోడస్‌ మీడియా పతాకంపై శ్రీమతి నీలిమ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్‌ ఎన్‌వీఆర్‌ దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana