- ఐదు రోజుల్లోనే దుబాయ్ నుంచి తరలింపు
తంగళ్లపల్లి, సెప్టెంబర్ 20: బతుకుదెరువు కోసం దుబాయ్‌కు వెళ్లిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందగా, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో ఐ దు రోజుల్లోనే ఆయన పార్థివదేహం గ్రా మానికి చేరుకున్నది.
వివరాల్లోకి వెళ్తే.. రా జన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి ఓల్లపు రవి ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లాడు. ఈ క్రమంలో ఈనెల 15న అకడ గుండెపోటుతో మృతి చెందగా, పేద కుటుంబానికి చెందిన రవి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడం కుటుం బ సభ్యులకు భారంగా మారింది.
రవి విష యం తెలుసుకున్న బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు బొల్లి రామ్మోహన్ వెంటనే పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కేటీఆర్ తన కార్యాలయం ద్వారా దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయంతో మాట్లాడారు. కేటీఆర్ చొరవతో కేవలం ఐదు రోజుల్లోనే రవి పార్థివదేహాన్ని స్వగ్రామం తంగళ్లపల్లికి తీసుకువచ్చారు. కష్టకాలంలో ఆదుకున్న కేటీఆర్, బొల్లి రామ్మోహన్‌కు రవి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

