Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కిరాణా సామగ్రి సరఫరా కేంద్రీకృతం.. సెంట్రలైజ్డ్‌ ప్రొక్యూర్‌మెంట్‌కు సర్కార్‌ నిర్ణయం

కిరాణా సామగ్రి సరఫరా కేంద్రీకృతం.. సెంట్రలైజ్డ్‌ ప్రొక్యూర్‌మెంట్‌కు సర్కార్‌ నిర్ణయం

  • పీఎంయూ నుంచి తాజాగా టెండర్లకు ఆహ్వానం

హైదరాబాద్‌, మే 22 (నమస్తే తెలంగాణ) : విద్యార్థుల కోసం పుస్తకాలు, యూనిఫామ్స్‌, స్టేషనరీ, దుప్పట్లు, బూట్లు, సాక్సులు మొత్తంగా 9 రకాల వస్తువులకు ప్రభుత్వం టెండర్లను పిలిచింది.

ఏజెన్సీలను ఎంపిక చేసి వర్క్‌ ఆర్డర్లు ఇవ్వడమే ఇక మిగిలింది. తాజాగా కిరాణా సామగ్రికి సంబంధించి టెండర్లను సైతం కేంద్రీకృత విధానంలోనే ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే గు రుకుల ప్రిన్సిపాల్స్‌ నుంచి ఏ సరుకులు ఏ ప్ర మాణాల మేరకు అవసరమవుతాయోననే వి వరాలను సేకరించింది. త్వరలోనే టెండర్లను పిలిచేందుకు సిద్ధమవుతున్నది. రాష్టంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్‌ గురుకులాలతోపాటు, సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బా విద్యాలయాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, మోడల్‌ స్కూల్స్‌, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి.

ఆయా సంస్థల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారు. బియ్యం ప్రభుత్వమే సరఫరా చేస్తుండగా, పాలు విజయడెయిరీ నుంచి సరఫరా అవుతున్నాయి. ఇవి పోగా కిరాణా సామగ్రి, చికెన్‌, మటన్‌, గుడ్లు, కాయగూరలను ఇప్పటివరకు కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీ (డీపీసీ)లేఎక్కడికక్కడ టెండర్లు నిర్వహించి, సప్లయ్‌ బాధ్యతలను గుత్తేదారులకు అప్పగించేవి. కానీ ఈ ప్రభుత్వం డీపీసీల స్థానంలో సోషల్‌వెల్ఫేర్‌ సెక్రటరీ నేతృత్వంలో ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్‌ (పీఎంయూ)ను గతేడాది ఏర్పాటుచేసింది. గురుకులాలకు సంబంధించి వస్తువుల ధరల ఖరారు, సేకరణ, సరఫరా, టెండర్‌ ప్రక్రియను కేంద్రీకృత విధానంలో ఇక్కడే నిర్వహిస్తుంది. ఏజెన్సీలను ఎంపిక చేస్తుంది. కిరాణా సామగ్రికి సంబంధించి టెండర్లను నిర్వహించేందుకు పూనుకోగా, పలువురు గుత్తేదారులు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కోర్టు కేసు సైతం క్లియర్‌ అ యినట్టు తెలుస్తున్నది.

ప్రిన్సిపాల్స్‌ నుంచి వివరాల సేకరణ..

ప్రస్తుతం ప్రిన్సిపాల్స్‌ నుంచి ప్రభుత్వం వి వరాలను సేకరిస్తున్నది. ఏడాదికి ఎంత పరిమాణంలో ఆయా వస్తువులు అవసరమవుతా యో అంచనాలు ఇవ్వాలని కోరింది. ప్రిన్సిపా ల్స్‌ సైతం తమ వద్దనున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా వివరాలను సమర్పించారు.

టెండర్ల స్వీకరణ ప్రారంభం..

గురుకులాలకు సంబంధించి ఫుడ్‌ ఐటమ్స్‌ సప్లయ్‌ చేసేందుకు ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్‌ చైర్మన్‌ శుక్రవారం నోటిఫికేషన్‌ జా రీచేశారు. గుత్తేదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. జూన్‌1వ తేదీ వరకు బిడ్లను సమర్పించాలని వెల్లడించారు. ఏ వస్తువులు ఎంత కావాలనేది కూడా వెల్లడించారు. ఇదిలా ఉంటే బిడ్లలో పాల్గొనేందుకు దాదాపు రూ.16కోట్ల ఈఎండీని చెల్లించాలనే నిబంధన విధించింది. ఇక గతంలో మాదిరిగానే ఏ వస్తువుకు ఎంత ధరనేది కూ డా నిర్ణయించలేదు.

100 కోట్ల స్కామ్‌..!

కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యార్థుల ఫుడ్‌ ప్రొవిజన్‌ టెండర్లలో రూ.100 కోట్లు కొట్టేసేందుకు స్కెచ్‌ వేసిందని గురుకుల వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మొత్తం కిరాణా సామగ్రి బిల్లు రూ.500 కోట్లకు పైగా ఉంటుంది. ఇందులో నూ 20 శాతం కమీషన్‌ (రూ.100 కోట్లు)కు స్కెచ్‌ వేశారని చర్చించుకుంటున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana