Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కిటికీ ఫ్యాషన్‌గా..!

కిటికీ ఫ్యాషన్‌గా..!

ఇంటిని అలంకరించేటప్పుడు గోడలు, సోఫా, దీపాలు, అలంకరణ వస్తువులపై ఎంత శ్రద్ధ పెడతామో… కిటికీ దగ్గర మాత్రం దాన్ని అంతలా చూపం. చాలాసార్లు ఏదో ఒక తెర వేసి సరిపెడతాం.

కానీ, ఇప్పుడు ఇంటీరియర్‌ ప్రపంచంలో ఆ ఆలోచన మారుతున్నది. కిటికీ కూడా గదిలోని అలంకరణలో ఒక ముఖ్యమైన భాగమే అంటున్నారు డిజైనర్లు. అందుకే ఈ ఏడాది కర్టెన్ల విషయంలో కొత్త కొత్త ప్రయోగాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎకువగా కనిపిస్తున్న మార్పుల్లో ఒకటి రెండు పొరల తెరలు. పగటి వెలుతురు మృదువుగా లోపలికి రావడానికి పలుచని తెర, రాత్రివేళ గోప్యత కోసం మందమైన తెర… ఇలా రెండింటినీ కలిపి అమర్చుతున్నారు. అవసరాన్ని బట్టి ఒకటి తెరిచి, మరొకటి మూసుకోవచ్చు. అందం మాత్రమే కాదు, కావలసినట్టు చాటు ఉంటూ… వెలుతురు మన నియంత్రణలో ఉండేలా.. రకరకాల ప్రయోజనాలు ఉండటంతో ఈ పద్ధతికి ఆదరణ పెరుగుతున్నది.

ఇక వంటగది, డైనింగ్‌ హాల్‌ లాంటి చోట్ల కిటికీలో సగం వరకు మాత్రమే వచ్చే చిన్న తెరలు కూడా మళ్లీ ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఇవి కిటికీ మొత్తాన్ని కప్పకుండా, అవసరమైనంత మాత్రమే మూసి ఉంచుతాయి. అంటే పై భాగం నుంచి వెలుతురు వస్తుంది. మిగతా భాగం కర్టెన్‌ ఉంటుంది. వీటిని కేఫ్‌ కర్టెన్లు అని పిలుస్తారు. అయితే పాతకాలపు లేసు, బరువైన అలంకరణలకు బదులుగా ఇప్పుడు సాదాసీదా వస్త్రాలతో, చకటి ఆకృతుల్లో వీటిని రూపొందిస్తున్నారు. మరో ఆసక్తికరమైన మార్పు ఏంటంటే, గోడ రంగుకు దగ్గరగా ఉండే కర్టెన్లు. గోడ, తెర వేర్వేరుగా కనిపించకుండా ఒకే రంగులోని వివిధ ఛాయలను ఎంచుకుంటే గది మరింత విశాలంగా కనిపిస్తుంది. అలా అని ఇవన్నీ ఖరీదైనవేం కాదు, కాస్త అభిరుచి ఉంటే… ఎవరైనా అందంగా అలంకరించేయొచ్చు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana