Dailyhunt
కోహ్లీకి.. సింహానికి తేడా అదే: చాహల్‌

కోహ్లీకి.. సింహానికి తేడా అదే: చాహల్‌

న్యూఢిల్లీ: కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫొటో ను, పక్కనే సింహం ఉన్న మరో చిత్రాన్ని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) ఫ్రాంచైజీ సోమవారం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. అతడిని సింహంతో పో ల్చింది. 'తేడాలను గుర్తించండి, ఎందుకంటే మేం కనిపెట్టలేకపోయాం' అని రాసుకొచ్చింది. ఈ పోస్టుకు ఆర్సీబీ స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ సరదాగా కామెంట్‌ చేశాడు. 'తేడా ఏంటంటే.. మొదటి ఫొటోలో దుస్తులు ధరించింది. రెండో ఫొటోలో దుస్తులు లేకుండా ఉంది' అంటూ రాసుకొచ్చాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్‌ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని కోహ్లీ, చాహల్‌ ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana