Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కోలుకున్న స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 315, నిఫ్టీ 77 పాయింట్లు అప్‌

కోలుకున్న స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 315, నిఫ్టీ 77 పాయింట్లు అప్‌

ముంబై, సెప్టెంబర్‌ 25: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల నుంచి తిరిగి కోలుకున్నాయి. బ్లూచిప్‌ సంస్థల షేర్లతోపాటు బ్యాంకింగ్‌, చమురు అండ్‌ గ్యాస్‌, వాహన రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు.

ఫలితంగా వారాంతపు ట్రేడింగ్‌లో సూచీలు లాభాల్లోకి రాగలిగాయి. ఒక దశలో 500 పాయింట్ల వరకు పెరిగిన 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ చివరకు మార్కెట్‌ ముగిసే సమయానికి 315.20 పాయింట్లు అందుకొని 73,895.74 వద్ద నిలిచింది.

30 షేర్ల ఇండెక్స్‌లో 19 షేర్లు లాభపడగా, 11 షేర్లు నష్టపోయాయి. మరో సూచీ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 77.40 పాయింట్లు అందుకొని 23,140.50 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ ఇంధన ధర 1 శాతం తగ్గి 105 డాలర్లకు తగ్గడం మదుపర్లలో ఉత్సాహాన్ని నింపిందని జియోజిట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్‌ రీసర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. తీవ్ర ఊగిసలాటల మధ్య కొనసాగిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు చివరికి లాభాల్లోకి రావడానికి దోహదపడ్డాయన్నారు.

  • యాక్సిస్‌ బ్యాంక్‌, మహీంద్రా షేర్లు రెండు శాతానికి పైగా బలపడ్డాయి.
  • వీటితోపాటు ఏషియన్‌ పెయింట్స్‌, టీవీఎస్‌ మోటర్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, టైటాన్‌ షేర్లు ఒక్క శాతానికి పైగా పెరిగాయి.
  • అలాగే ఇండిగో, ఎల్‌అండ్‌టీ, నెస్లె, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌, కోల్‌ ఇండియా, శ్రీరామ్‌ఫైనాన్స్‌, రిలయన్స్‌, మారుతి, హెచ్‌ఏఎల్‌, ఐటీసీ, ఎస్బీఐ షేర్లు లాభపడ్డాయి.
  • మ్యాక్స్‌హెల్త్‌కేర్‌ షేరు 3.20 శాతం తగ్గి టాప్‌ లూజర్‌గా నిలిచింది.
  • దీంతోపాటు టీఎంపీవీ, ట్రెంట్‌, ఓఎన్‌జీసీ, జియోఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌, హిందాల్కో, ఎస్బీఐ లైఫ్‌, సిప్లా, కొటక్‌ బ్యాంక్‌ షేర్లు పతనం చెందాయి.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana