న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఏర్పాటు చేసిన కొవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌లో క్రికెట్ దిగ్గజం, జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) చీఫ్ రాహుల్ ద్రవిడ్‌కు చోటు దక్కింది. రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ప్రామాణిక నిర్వహణ విధానాన్ని(ఎస్వోపీ) సోమవారం ప్రకటించిన బీసీసీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. ఎస్వోపీ నిబంధనలు పాటిస్తూ ప్రాక్టీస్ చేస్తామని ప్లేయర్లు ఆయా రాష్ట్ర సంఘాల సెంటర్లలో సంతకాలతో కూడిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే బెంగళూరులోని ఎన్సీఏలో ఆటగాళ్లకు ట్రైనింగ్‌ను పునఃప్రారంభించేందుకు అవకాశం ఉంది.
కరోనా ప్రమాదం నేపథ్యంలో ట్రైనింగ్‌లో ప్లేయర్లు అందరూ ఎస్వోపీ నిబంధలు పాటించేలా చూసేందుకు బీసీసీఐ కొవిడ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది.

