Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
KTR | 30 నెలల్లో కూడా పిల్లలు పుట్టకపోతే నిన్ను ఏమనాలే రేవంత్ రెడ్డి..? : కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ధర్నాలో కేటీఆర్

KTR | 30 నెలల్లో కూడా పిల్లలు పుట్టకపోతే నిన్ను ఏమనాలే రేవంత్ రెడ్డి..? : కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ధర్నాలో కేటీఆర్

KTR | కేసీఆర్ తొమ్మిదన్నరేళ్ల కాలంలో ప్రవీణ్‌ కుమార్‌ లాంటి అద్భుతమైన ఆఫీసర్లకు అవకాశం ఇచ్చి మీరు స్వేచ్ఛగా పనిచేయడం బ్రదర్‌. ఈ రాష్ట్రంలో ఒక్కటే స్లోగన్‌ మనది.

సంపద సృష్టించాలి.. సంపద పెంచాలి.. పేదలకు పంచాలి అనే స్లోగన్‌తో ఆనాడు కేసీఆర్‌ నాయకత్వంలో అద్భుతమైన ఆఫీసర్లంతా ఉన్నతంగా పనిచేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇందిరా పార్క్‌ వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ధర్నా కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేవలం 200 గురుకుల పాఠశాలలుంటే వాటిని 1022 గురుకుల పాఠశాలలుగా అప్‌గ్రేడ్‌ చేసి ఆరున్నర లక్షల మంది పిల్లలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన పిల్లలు ఒక్కో విద్యార్థి మీద, విద్యార్థిని మీద రూ. లక్షా 25 వేలు ఖర్చు పెట్టి ఆరున్నర లక్షల మంది పిల్లల బాధ్యతలను తామే తల్లీ తండ్రీ అయి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని నడిపించింది కేసీఆర్ ప్రభుత్వం. వారికి సంబంధించిన బూట్లు, దుస్తులు, భోజనం, దుప్పట్లతో సహా ప్రభుత్వమే అన్నీచూసుకొని ఆ తల్లీతండ్రీ బాధ్యత కూడా తీసుకొని జాగ్రత్తగా తొమ్మిదిన్నరేళ్లు చదివించింది కేసీఆర్ ప్రభుత్వం.

మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాయమాటలు చెప్పి పచ్చి అబద్దాలు చెప్పి డిక్లరేషన్ల పేరుతో అన్ని వర్గాలను మోసం చేసి.. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ అని చేవెళ్లలో మల్జికార్జున ఖర్గేలాంటి పెద్ద మనిషిని పిలిచి మొత్తం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సోదరులను మోసం చేసి.. రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి వరంగల్‌లో రైతు డిక్లరేషన్ అని అక్కడ మోసంచేసి.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కామారెడ్డిలో నిల్చోబెట్టి బీసీ డిక్లరేషన్ అని చెప్పి అక్కడా మోసి.. ఆ తర్వాత మైనార్టీ డిక్లరేషన్ అని కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ కుర్షీద్‌ను తీసుకొచ్చి హైదరాబాద్‌లో మోసం చేసి.. యువజన విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పి ప్రియాంకా గాంధీతో హైదరాబాద్‌లో మీటింగ్ పెట్టి వారిని మోసం చేసి.. మొత్తం ఒకటి రెండు కాదు 420 హామీలిచ్చి.. అందులో ఆరు గ్యారంటీలు అని స్పెషల్‌గా చెప్పి నూరు రోజుల్లో పూర్తి చేస్తామని డైలాగ్స్ కొట్టి గద్దెనెక్కింది కాంగ్రెస్ పార్టీ.. పేమెంట్ కోటాలో సీటు కొట్టిండు రేవంత్‌ రెడ్డి.

నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నడు..
ఆడ ఢిల్లీకి డబ్బులు పంపకపోతే సీటు గాయబ్‌.. అందరికీ తెలుసు.. మీకు.. నాకు.. వాళ్ల మంత్రులకు కూడా తెలుసు. సరే గద్దెనెక్కిండు నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నడు. ప్రతీ సంవత్సరం ఒక్కో పేద కుటుంబానికి రెండున్నర లక్షలు రూపాయలిస్తా అన్నడు.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్నడు. మరి నూరు రోజులంటివి.. ఇన్ని కథలు చెప్తివి రేవంత్‌ రెడ్డి.. మరి ఏమాయే అని అడిగితే మొన్న ఆదిలాబాద్‌లో అంటున్నడు. చావు కబురు చల్లగా చెప్పినట్టు.. మీకు తెల్వదా.. ఎంత కండలు తిరిగిన పహిల్వాన్ అయినా మూడు నెలల్లోనే పిల్లలు పుట్టిస్తడా..? అని రేవంత్‌ రెడ్డి చెప్తున్నడు. మూడు నెలల్లో పిల్లలు పుట్టరన్న విషయం మనకు తెల్వదట. ముఖ్యమంత్రి మనకు ఈ ముచ్చట చెప్పాలట. మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్ల జాక్ ఏర్పాటు చేసిన ఈ మహాధర్నా వేదికగా రేవంత్ రెడ్డిని ఒక్కటే అడుగుతున్నా..మూడు నెలల్లో పిల్లలు పుట్టరు..మాకు కూడా తెలుసు.. మీకు కూడా తెలుసు.. మరి 30నెలల్లో కూడా పిల్లలు పుట్టకపోతే నిన్ను ఏమనాలే..? చాతకానోడని అనాలా..?అని ఎద్దేవా చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana