Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
KTR | మంత్రుల కొడుకులు దౌర్జన్యాలు చేసినా, వేరే పార్టీల ఎంపీల కొడుకులు గుద్ది చంపినా కేసులుండవు

KTR | మంత్రుల కొడుకులు దౌర్జన్యాలు చేసినా, వేరే పార్టీల ఎంపీల కొడుకులు గుద్ది చంపినా కేసులుండవు

KTR | హైదరాబాద్‌ నడిబొడ్డున మంత్రుల కొడుకులు దౌర్జన్యాలు చేసినా, వేరే పార్టీల ఎంపీల కొడుకులు గుద్ది చంపినా కేసులు పెట్టకుండా తెలంగాణ పోలీసులు కాపాడుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అన్నారు.

మాజీ మంత్రి హరీశ్ రావుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి 1000 రోజుల దగా పాలనపై తెలంగాణ భవన్‌లో 'ఛార్జ్ షీట్'ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. విశ్వనగరం హైదరాబాద్‌లో శాంతి భద్రతలు పూర్తిగా క్షిణించాయన్నారు. పట్టపగలే కారుతో సామాన్య జనాన్ని గుద్ది చంపినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదు.

రేవంత్‌ పాలనలో ఇది తెలంగాణ దుస్థితి అని మండిపడ్డారు. బొల్లారం మిలిటరీ వాళ్ల స్థావరంపైనే దాడి జరగడమంటే ఇంతకంటే హీనమైన ప్రభుత్వం, ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి ఇంకోటి లేదన్నారు. ఆడబిడ్డలపై హత్యాచారాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. బీజేపీ నేతల కొడుకులపై పోక్సో ఆరోపణలు వస్తే సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నిందితులు సీఎం బంధువుల దవాఖానలోనే షెల్టర్‌ ఇప్పించారు. వారిని తొమ్మిది రోజుల పాటు కంటికి రెప్పలా సీఎం కాపాడారని ఆరోపించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana