ఆదిలాబాద్ : ఆదిలాబాద్( Adilabad ) లో ఆదివారం సాయంత్రం నిర్వహించనున్న రైతు గర్జన సభకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ను ముఖరా (కే) రోడ్డు వద్ద మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, రైతులు కలిశారు.
ఈ సందర్భంగా ఎండిపోయిన పత్తి పంటలను కేటీఆర్‌కు చూపించి తమ సమస్యలను వివరించారు. కేటీఆర్ మాట్లాడుతూ ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ కావాలనే తెచ్చిన కరువు అని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, సాగునీరు ఇవ్వకుండా, రైతు భరోసా అందించకుండా రైతుల బతుకులను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఎండిపోయిన పత్తి పంటకు ఎకరానికి రూ.25 వేల చొప్పున, సోయా , ఇతర పంటలకు ఎకరానికి రూ.20 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్, , బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ముఖరా (కే) రైతులు పాల్గొన్నారు.

