Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
KTR | రేవంత్‌, సంజయ్‌ తోడుదొంగలు..వారి చీకటి బంధం వల్లే ఆడబిడ్డకు అన్యాయం : కేటీఆర్‌

KTR | రేవంత్‌, సంజయ్‌ తోడుదొంగలు..వారి చీకటి బంధం వల్లే ఆడబిడ్డకు అన్యాయం : కేటీఆర్‌

  • వారి చీకటి బంధం వల్లే ఆడబిడ్డకు అన్యాయం
  • పోక్సో నిందితుడిని 9 రోజులు దాచిందెవరు?
  • ప్రధాని వస్తే నేరస్తులకు హాలిడే ఇస్తరా?: కేటీఆర్‌
  • వారి చీకటి బంధం వల్లే ఆడబిడ్డకు అన్యాయం
  • పోక్సో నిందితుడిని 9 రోజులు దాచిందెవరు?
  • కేంద్రమంత్రి కొడుకు కావడం, సీఎం అండదండలు ఉండటంవల్లే నిందితుడికి ఆశ్రయం: కేటీఆర్‌
  • సీఎం సన్నిహితుడి దవాఖానలోనే దాచిండ్రట నిందితుడి తండ్రి సామాన్యుడైతే వదిలేవారా?
  • వార్తలు రాయకుండా మీడియా కాళ్లపై పడ్డారు
  • బాధితురాలి కుటుంబంపై హనీట్రాప్‌ అంటూ కౌంటర్‌ కేసు పెట్టించింది ఎవరో చెప్పాలి
  • నా తండ్రి కేసీఆర్‌, నా కొడుకు హిమాన్షు
  • తన కొడుకుతో సంబంధం లేదని చెప్పిన బండి సంజయ్‌లా నేను పిరికివాడిని కాను

హైదరాబాద్‌, మే 22 (నమస్తే తెలంగాణ): పోక్సో కేసు నిందితుడిని తొమ్మిది రోజులపాటు పోలీసులకు దొరుకకుండా దాచి ఉంచిన ఘోరమైన నేరం ముమ్మాటికీ హోంమంత్రి బాధ్యతల్లో ఉన్న సీఎం రేవంత్‌దేనని బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రస్థాయి లో విమర్శించారు. కేంద్రమంత్రి బండి సంజ య్‌, సీఎం రేవంత్‌ తోడుదొంగలని, వారి మధ్య ఉన్న చీకటి అనుబంధం వల్లే ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. హైకోర్టు బెయిల్‌ ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చె ప్పడం, ఆడబిడ్డలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పో యడంతోనే సిగ్గు తెచ్చుకొని, గత్యంతరం లేక నిందితుడిని అరెస్టు చేశారని చెప్పారు.

పోక్సో కేసులో నిందితుడి తండ్రి సాధారణ వ్యక్తి అయితే ఇలాగే వదిలేసేవారా? అని ప్రశ్నించా రు. హోంశాఖకు బాధ్యుడిగా ఉన్న సీఎం, ప్రధాని పర్యటన వల్ల పోలీసులంతా బిజీగా ఉన్నారని సాకులు చెప్పినందుకు సిగ్గుపడాల ని నిప్పులు చెరిగారు. బీఆర్‌ఎస్‌ పోరాడకపోయి ఉంటే బాధితురాలికి ఈమాత్రం కూడా న్యాయం దక్కేదికాదని గుర్తుచేశారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ పోక్సో కేసు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు, సీఎం రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు.

ప్రధాని వస్తే నేరస్తులకు హాలిడే ఇస్తారా?

బాలికకు అన్యాయం జరిగిందని తల్లిదండ్రులు బాధితురాలితో కలిసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వస్తే తీసుకోవడానికి నిరాకరించారని, దీనికి హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌ కారణం కాదా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే అర్ధరాత్రి వరకు నిలబెట్టి వేధించింది..ఆ తర్వాత బాధితురాలి కుటుంబాన్ని బెదిరించి కౌంటర్‌ కేస్‌ పెట్టించింది ఎవరు? అని నిలదీశారు. పోక్సో కేసులో నిందితుడికి తొమ్మిది రోజులపాటు రాచమర్యాదలు చేసి కాపాడింది ఎవరు? అని నిప్పులు చెరిగారు. ప్రధాని బందోబస్తులో ఉన్నాం కాబట్టి కేసు పెట్టలేకపోయామని డీజీ పీ వ్యాఖ్యానించడంపై కేటీఆర్‌ మండిపడ్డారు. ప్రధాని పర్యటనకు వచ్చినప్పుడు నేరస్తులకు మూడు రోజులు హాలిడే ఇస్తరా? అని ప్రశ్నించారు. మూడు రోజులు చంపుకోండని చంచల్‌గూడ జైల్లో రేవంత్‌రెడ్డితో గడిపిన బ్యాచ్‌మేట్స్‌కు చెలరేగిపొమ్మని చెప్తరా? అసలు ఏమి చెప్పాలనుకుంటున్నారు? అని నిలదీశారు.

దేశంలో ఎకడైనా ఒక పోక్సో కేసు నిందితుడిని తొమ్మిది రోజులపాటు దాచిపెట్టిన దాఖలాలున్నాయా? ముఖ్యమంత్రి సన్నిహితుడికి చెందిన దవాఖానలోనే నిందితుడిని తొమ్మిది రోజులు దాచి ఉంచారని ఓ వీడియోలో చూసిన. దీనిపై ప్రభుత్వం ఎందుకు విచారణ జరుపడం లేదు? మీడియా ఎందుకు పరిశోధనాత్మక కథనాలు రాయడం లేదు? హైకోర్టు బెయిల్‌ ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పడం, తెలంగాణ ఆడబిడ్డలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడంతోనే సిగ్గు తెచ్చుకుని, గత్యంతరం లేక నిందితుడిని అరెస్టు చేశారు.

-కేటీఆర్‌

బాలికకు అన్యాయం జరిగిందని తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే తీసుకోవడానికి నిరాకరించారు. దీనికి హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కారణం కాదా?. పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే అర్ధరాత్రి వరకు నిలబెట్టి వేధించింది? ఆ తర్వాత బాధితురాలి కుటుంబాన్ని బెదిరించి కౌంటర్‌ కేస్‌ పెట్టించింది ఎవరు?. పోక్సో కేసులో నిందితుడికి తొమ్మిది రోజులపాటు రాచమర్యాదలు చేసి కాపాడింది ఎవరు?

-కేటీఆర్‌

ముఖ్యమంత్రికి బుద్ధి ఉన్నదా?

పోక్సో కేసుపై ప్రశ్నిస్తే రేవంత్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నాడని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. అత్యంత సున్నితమైన బాలిక కేసు విషయం లో పార్టీ తరఫున మౌనంగా ఉన్నామని, ఏనాడూ రాజకీయం చేయలేదని తెలిపారు. సీఎ తమపై విమర్శలు చేసిన తర్వాతనే తప్ప ని పరిస్థితుల్లో ఈ అంశంపైన మాట్లాడాల్సి వస్తున్నదని చెప్పారు. 'సీఎం రేవంత్‌కు అసలు బుద్ధి ఉన్నదా? లేక వడదెబ్బకు చిన్నమెదడు చితికిపోయిందా?' అని దెప్పిపొడిచారు. 'మా బావమరిది ఇంటిపై డ్రగ్స్‌ దాడి జరిగిందని అడ్డగోలుగా మాట్లాడుతున్న రేవంత్‌.. ప్రభు త్వం మీదే కదా.. దమ్ముంటే మా బావమరిదిపై కేసు పెట్టు.. విచారణ చేపట్టు ఎవరు వద్దన్నారు?' అని చురకలంటించారు. 'ఎక్సైజ్‌ అధికారి అక్కడ ఏమీ దొరుకలేదని చెప్పారు. మీరు అక్కడ ఏదో డ్రగ్‌ పెడుదామనుకున్నా కుదరలేదు' అని చురకలంటించారు.

కేంద్ర మంత్రి కొడుకు రేప్‌ చేసినా మాఫ్‌ చేస్తరా?

పోక్సో కేసు నిందితుడిని స్వయంగా ముఖ్యమంత్రే తొమ్మిది రోజులు దాచిపెట్టిన సందర్భం దేశంలో ఎకడైనా ఉన్నాదా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. 'కేసు రాయడానికి భయం. మీడియాలో రాయడానికి భయం. ఈ మేనేజ్‌మెంట్‌ అంతా ఎవరు చేస్తారు. మీరు, మీ ఫ్రెండ్‌.. మీ ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ కాదా? మీడియాకు ఫోన్లు చేసి బతిమిలాడింది వాస్త వం కాదా? రాయకండి దండం పెడుతా అన్న ది నిజం కాదా? మీడియా కూడా రాయకుం డా ఉన్నది నిజం కాదా? పోక్సో నిందితుడిని తొమ్మిది రోజులు దాచిపెడితే సామాన్యుడిని అయితే పోలీసులు ఊరుకుంటరా? వాళ్ల తల్లిదండ్రులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి కూసోబెట్టరా? కోదండం ఎక్కించరా? కేంద్రమంత్రి కాబట్టి మినహాయింపు ఇచ్చారా? రేప్‌ చేసినా, హత్య చేసినా మాఫ్‌ చేస్తారా? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నడు కాబట్టి కాపాడుకుంటమని హామీ ఇస్తున్నారా?' అని నిప్పులు చెరిగారు.

హైకోర్టుకు సెల్యూట్‌

హైకోర్టు సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో నిందితుడిని వారు న్యాయవ్యవస్థకు అప్పగించాల్సిన పరిస్థితి ఏ ర్పడిందని కేటీఆర్‌ చెప్పారు. 'మీడియా మౌనం, కేంద్రం మౌనం, కేంద్ర మంత్రులు మౌనం, రాష్ట్ర ప్రభుత్వం మౌనం. ఇన్ని వ్యవస్థలు ఒక్కటైతే చివరికి న్యాయ వ్యవస్థ వల్ల ఆ బాలికకు న్యాయం జరిగింది' అని పేర్కొన్నా రు. బాధితురాలితోపాటు లక్షలాది మంది బాలికల తరఫున హైకోర్టుకు కేటీఆర్‌ సెల్యూట్‌ చేశారు. తాము గనుక నోరు విప్పకపోయి ఉంటే ఆ బాలికకు న్యాయం జరిగేది కాదని చె ప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలో ఎవరికి అన్యాయం జరిగినా వారి తరఫున పోరాడామని, పోరాడుతూనే ఉన్నామని స్పష్టంచేశారు.

'లగచర్ల, వెలుగుమట్ల, మహబూబ్‌నగర్‌, హైడ్రా, మూసీ బాధితు లు.. ఇట్ల బాధితులందరి పక్షా న ప్రభుత్వంపై కొట్లాడింది బరాబర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీయే.. ఇప్పుడు రైతుల పక్షాన పోరాడేది, నిలబడేది కూడా బీఆర్‌ఎస్సే' అని తేల్చిచెప్పారు. 'బండి లొంగుబాటు అంటడు.. సీఎం అరెస్టు అంట డు.. ఇద్దరు తోడు దొంగలు కలిసి డ్రామాలు ఆడుతున్నరు. ఇట్ల మాట్లాడటానికి సిగ్గుండాలె' అని ధ్వజమెత్తారు. 'రేవంత్‌రెడ్డి హైట్‌ ఒక్కటే తక్కువ అనుకున్న.. బుర్ర కూడా తక్కువే'నని దెప్పిపొడిచారు.

హనీట్రాప్‌ అని మనీట్రాప్‌లో పడిన మీడియా ఏదీ?

'ఒక బాలికకు అన్యాయం జరిగితే, ఆమె వివరాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసిన ఆ వెధవలు ఎవరో బయటపెట్టాలి' అని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. బాధిత బాలిక వివరాలు బయటపెట్టారని పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో 15 మందిపై కేసు నమోదైందని, వారం తా బీజేపీకి చెందినవారేనని చెప్పారు. 'హనీట్రాప్‌ అని మనీ ట్రాప్‌లో పడిన మీడియా ఏదీ?' అని ప్రశ్నించారు. నిందితుడిని తొమ్మి ది రోజులు దాచారని, బాధితురాలి కుటుంబసభ్యులను బెదిరించారని, న్యాయంగా అయి తే బండి సంజయ్‌పై కేసు పెట్టాలని, బండికి సిగ్గుంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్‌, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సుద్దపూసల్లా, సత్యసంతుల్లా నాటకాలు ఆడుతున్నారని, ఒకరేమో అరెస్టు చేశామని, మరొకరేమో లొంగిపొమ్మని పంపించానని చెప్తూ యాక్టింగ్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 'ఎందుకు భయపడుతున్నవ్‌ రేవంత్‌రెడ్డీ? చెవుల్లో మోదీ ఏమైనా చెప్పారా?' అని నిలదీశారు.

ఆర్‌ఎస్పీకి అభినందనలు

బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి, ఐపీఎస్‌ మాజీ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బాధితురాలి పక్షాన అద్భుతంగా పోరాడారని కేటీఆర్‌ ప్రశంసించారు. ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సెక్షన్లతో సహా ఏ కేసు ఎప్పుడు పెట్టాలో మీడియాను, ప్రజలను కూడా అప్రమత్తం చేశారని గుర్తుచేశారు. తమ పార్టీ తరఫున బాలికకు న్యాయం జరుగాలని ఆయన పోరాడారని చెప్పారు. చివరికి ఆయనపైనా అడ్డగోలుగా మాట్లాడారని, ప్రవీ ణ్‌ ఏమైనా జడ్జా? అని ప్రశ్నించారని ఆక్షేపించారు. 'ఆయన జడ్జికాదు.. కానీ, భవిష్యత్తులో మీకు పాఠాలు చెప్పే రోజు వస్తది' అని హితవుపలికారు. సమీక్షలో దొంగలను ఎలా పట్టుకోవాలని రేవంత్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు చెప్తున్నారట… ఇంతకన్నా విచిత్రం ఇంకోటి ఉంటదా? అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. 'దొంగలను ఎట్లా పట్టుకోవాలో పోలీసులకు తెలుసు.. వలవేసి, ఉచ్చుపన్ని నిన్ను పట్టుకున్నది వాళ్లే. ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తి చెప్తున్నప్పుడు అక్కడున్న పోలీసులు నవ్వుకున్నారట' అని ఎద్దేవా చేశారు.

నేను తండ్రి పేరు దాచుకునేటోన్ని కాదు. కొడుకుతో నాకు సంబంధం లేదని చెప్పకొనేటోన్ని కాదు. నా పేరు, నా కొడుకు పేరు కలిపి రాయొద్దని కోర్టు ద్వారా గ్యాగ్‌ ఆర్డర్లు తెచ్చుకొనేటోన్ని కాదు. మా నాన్న పేరు కేసీఆర్‌.. నా కొడుకు పేరు హిమాన్షు.. నా పేరు కేటీఆర్‌. ఏ కేసు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనే ధైర్యం నాకు ఉన్నది.

-కేటీఆర్‌

9 రోజులు ఎక్కడ దాచి పెట్టారు?

పోక్సో కేసులో నిందితుడిని తొమ్మిది రోజులు ఎక్కడ దాచి పెట్టారని కేటీఆర్‌ ప్రశ్నించారు. దాచి పెట్టింది ముఖ్యమంత్రా? కేంద్రమంత్రా? ఎవరో చెప్పాలని నిలదీశారు. 'రేవంత్‌రెడ్డి రాగానే పోలీసులు పనికిరాని వాళ్లలా మారిపోయారా? నిందితుడు దొరుకడం లేదా? కరీంనగర్‌లో జ్యువెల్లరీ షాప్‌లో తుపాకులతో కాల్చిన దొంగలను పట్టుకోవడానికి 15 రోజులా?' అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూసి బాలికలు ఎవరైనా తమకు జరిగిన అన్యాయాన్ని ఎదురించేందుకు, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి ముందుకొస్తారా? అని ప్రశ్నించారు. నిందితుడు పలుకుబడి కలిగినవాడైతే రెండు పార్టీలు కలిసిపోతాయని, సీఎం, కేంద్ర మంత్రి కలిసిపోతారని అనుకోరా? అని నిలదీశారు. పోక్సో నిందితుడిని సీఎం సమీప బంధువుకు చెందిన దవాఖాన 28వ అంతస్తులో దాచిపెట్టారని ఓ వీడియోలో చూశానని వెల్లడించారు.

'బండి లొంగుబాటు అంటడు.. సీఎం అరెస్టు అంటడు.. ఇద్దరు తోడు దొంగలు కలిసి డ్రామాలాడుతున్నరు. ఆ బాలికతోపాటు తెలంగాణ ఆడబిడ్డలు అందరూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ముఖంపై ఉమ్ముతున్నరు. రేవంత్‌రెడ్డి హైట్‌ ఒక్కటే తక్కువనుకున్న.. బుర్ర కూడా తక్కువే.

-కేటీఆర్‌

హనీట్రాప్‌ కుట్ర ఎవరిదో చెప్పాలి?

బాధితురాలి కుటుంబంపైనే హనీట్రాప్‌ అంటూ రివర్స్‌ కేసు పెట్టించి కుట్ర చేసినోళ్లు ఎవరో బండి సంజయ్‌, రేవంత్‌ సమాధానం చెప్పాలని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. హనీట్రాప్‌ అని వేసినవారిని బయటపెట్టి కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్‌ చేశారు. ఇందులో బీఆర్‌ఎస్‌ వ్యక్తులు ఎవరైనా ఉంటే బయటపెట్టాలని సవాల్‌ విసిరారు. రేవంత్‌ ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టుగా తమ పై దుమ్మెత్తిపోస్తున్నారని ఆక్షేపించారు. 'డ్రగ్స్‌ అని ఆరోపణలు చేస్తున్న రేవంత్‌కు అసెంబ్లీలోనే నేను అందరికీ డ్రగ్‌ టెస్టులు చేయించాలని డిమాండ్‌ చేసిన. రాష్ట్ర ప్రభుత్వం ఎందు కు పారిపోయింది? కాంగ్రెస్‌ ఎంపీలే దొరుకుతరు' అని ఎద్దేవాచేశారు. పైలెట్‌ రోహిత్‌రెడ్డికి షోకాజ్‌ నోటీసు ఇవ్వడంతోపాటు పార్టీ నుంచి ఎప్పుడో సస్పెండ్‌ చేశామని, సీఎంకు ఈ విషయం తెలియకపోతే తమ తప్పా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సభ్యత సంస్కారంతో మాట్లాడాలని, హద్దుమీరి మాట్లాడటం సరికాదని హితవుపలికారు.

బీజేపీతోనే రేవంత్‌

బీజేపీతో రేవంత్‌ కలిసే ఉన్నాడని, కొత్తగా కలువడానికి ఏమీ లేదని కేటీఆర్‌ ఎద్దేవా చేశా రు. తెలంగాణలో రాహుల్‌, రేవంత్‌ (ఆర్‌ఆర్‌) ట్యాక్స్‌ అని ఏప్రిల్‌ 2024లో ప్రధాని మోదీ చెప్పారని గుర్తుచేశారు. రెండేండ్లు అయిందని, ఇప్పుడు ఆ వ్యక్తిని తనతో కలిసి రావాలని మోదీ కోరుతున్నారని, దాని అర్థం ఏమిటని ప్రశ్నించారు. 'రెండేండ్లుగా మీరు చేస్తున్నవన్నీ మాకు తెలుసు, మాతో కలిసి వస్తే అన్నీ మాఫీ చేస్తాం.. వాషింగ్‌ పౌడర్‌ నిర్మా తరహాలో బీజేపీలో చేరగానే అంతా సఫేద్‌ చేస్తా.. రా బిడ్డా అని మోదీ పిలుస్తున్నరు' అని ఎద్దేవా చేశారు. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయని గుర్తుచేశారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని, కేంద్రం దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్‌ ఎంపవర్డ్‌ కమిటీ నివేదించినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. కలిసి లేకపోతే మోదీ ఎందుకు విచారణ జరిపించడం లేదని నిలదీశారు.

'రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటి మీద ఈడీ రైడ్స్‌ జరిగితే 18 నెలలైనా సోదాల్లో దొరికిన సొత్తు వివరాలను అటు ఈడీ చెప్ప దు.. ఇటు మంత్రి చెప్పరు.. దీని భావం ఏమి టి?' అని ప్రశ్నించారు. తెలంగాణ ఏఐసీసీకి ఏటీఎంగా మారిందని అమిత్‌షా చెప్తారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోరని ఎద్దేవా చేశారు. సీఎం బామ్మర్దికి కేంద్ర పథకాల్లో కాంట్రాక్టు లు వస్తాయని, కేంద్ర మంత్రులకు రాష్ట్రంలో కాంట్రాక్టులు దక్కుతున్నాయని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ఎంత దృఢమైన బంధం ఉన్నదో వీటిని బట్టే తెలుస్తున్నదని విమర్శించారు. రెండు పార్టీలు కలిసే ఉన్నాయని, తోడుదొంగలని విమర్శించారు.

కేసులను ధైర్యంగా ఎదుర్కొంటా

తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడనని, పారిపోనని, ధైర్యంగా ఎదుర్కొంటానని కేటీఆర్‌ స్పష్టంచేశారు. కొడుకుతో సంబంధం లేద ని బండి సంజయ్‌ మాదిరిగా చెప్పుకొనే పిరికివాణ్ణి కాదని చెప్పారు. 'నేను తండ్రి పేరు దాచుకునేటోన్ని కాదు. కొడుకుతో నాకు సం బంధం లేదని చెప్పకొనేటోన్ని కాదు. నా పేరు నా కొడుకు పేరు కలిపి రాయొద్దని కోర్టు ద్వారా గ్యాగ్‌ ఆర్డర్లు తెచ్చుకొనేటోన్ని కాదు. మా నాన్న పేరు కేసీఆర్‌.. నా కొడుకు పేరు హిమాన్షు.. నా పేరు కేటీఆర్‌. ఏ కేసు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనే ధైర్యం నాకు ఉన్నది' అని గట్టి కౌంటర్‌ ఇచ్చారు. బండి సంజయ్‌తో తనకు ఎలాంటి పంచాయితీ లేదని, బండి సంజయ్‌ తన తండ్రి గురించి అడ్డగోలుగా మాట్లాడినా ఏ రోజూ తాను స్పందించలేదని, ఈ రోజు కూడా సంజయ్‌ని ఏమీ అనడం లేదని, కేవలం నేరస్తుడు ఎవరైనా నేరస్తుడే అనే ఆలోచనతోనే మాట్లాడుతున్నానని స్పష్టంచేశారు.

సమీక్షలో దొంగలను ఎలా పట్టుకోవాలని రేవంత్‌రెడ్డి పోలీసు అధికారులకు చెప్తున్నాడట.. ఇంతకన్నా విచిత్రం ఇంకోటి ఉంటదా? దొంగలను ఎట్లా పట్టుకోవాలో పోలీసులకు తెలుసు.. నీలాంటి దొంగలు వాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదు. వలవేసి, ఉచ్చుపన్ని నిన్ను పట్టుకున్నది వాళ్లే. ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తి చెప్తున్నప్పుడు అక్కడున్న పోలీసులు నవ్వుకున్నరట..

-కేటీఆర్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana