హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ( KTR) కు బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఆదివారం ఆదిలాబాద్ ( Adilabad ) జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన రైతు గర్జన సభకు హాజరయ్యేందుకు హైదరాబాద్లోని తన నివాసం నుంచి బయలుదేరిన కేటీఆర్కు స్వాగతాలు, సన్మానాలు చేశారు.
మేడ్చల్, రామయంపేట, కామారెడ్డి, ఇందల్వాయి టోల్గేట్, ఆర్మూర్, నిర్మల్ లో నాయకులు కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు.





