Dailyhunt
KU | కాకతీయ యూనివర్సిటీ ఓఎస్డీగా వెంకట్రామిరెడ్డి నియామకం

KU | కాకతీయ యూనివర్సిటీ ఓఎస్డీగా వెంకట్రామిరెడ్డి నియామకం

నుమకొండ చౌరస్తా, ఏప్రిల్‌ 7: కాకతీయ విశ్వవిద్యాలయ ఆఫీసర్‌ అన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఓఎస్డీ)గా, భౌతికశాస్త్ర విభాగ ఆచార్యులు ప్రొఫెసర్‌ బి.వెంకట్రామిరెడ్డిని ఒక సంవత్సర కాలానికి నియమిస్తూ వైస్ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కర్నాటి ప్రతాప్‌రెడ్డి ఆదేశాలమేరకు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వల్లూరి రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డిని పలువురు బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు అభినందించారు. ప్రస్తుతం వెంకట్రామిరెడ్డి టీజీఎడ్‌సెట్‌ కన్వీనర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana