Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
KU | కేయూలో ఏబీఎస్‌ఎఫ్‌ నాయకుల నిరసన

KU | కేయూలో ఏబీఎస్‌ఎఫ్‌ నాయకుల నిరసన

KU | హనుమకొండ చౌరస్తా: తెలంగాణ రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయ్యింది. అయినా ఇప్పటి వరకు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోకుండా పూర్తిగా మోసం చేసిందని ఏబీఎస్ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్‌ ఆరోపించారు.

కాకతీయ యూనివర్సిటీ (Kakatiay University) గ్రంథాలయం వద్ద ఏబీఎస్ఎఫ్‌ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం మంద నరేష్‌ మాట్లాడుతూ రాష్ర్టంలో చదువుతున్న ఒక్క విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్స్,​ స్కాలర్షిప్స్​విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ప్రభుత్వం ఫీజులు (Fee) విడుదల చేయకపోవడంతో ప్రైవేట్‌ యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్స్​ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని వాపోయారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, భోజనం అందించడంలో, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏబీఎస్ఎఫ్‌ కేయూ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఇప్ప భరత్‌, ఉపాధ్యక్షులు ప్రణయ్‌, కార్తీక్‌, శ్రీను, రవి, దీక్షిత్‌, కళ్యాణ్‌ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana