MLA Kunamneni Sambashiva Rao | కాంగ్రెస్ సర్కార్ పని తీరు ఎలా ఉందో మరోసారి తెలియజేసేలా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడుతూ.. బడ్జెట్‌లో కేటాయింపులు జరిగితే వ్యవసాయ రంగానికి రూ.10 వేల కోట్లు, ఇరిగేషన్‌కు రూ.10 వేల కోట్లు, ఆర్‌అండ్‌బీకి రూ.10 వేల కోట్లు, మైనార్టీకి రూ.10 వేల కోట్లు అని ప్రకటించిన తర్వాత నువ్వు ఎంతైనా ఇవ్వు.. కేటాయించే అధికారం ఆ మంత్రి పరిధిలో ఉండాలి.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు పేరుకే ఉన్నారని ఎద్దేవా చేశారు.
మంత్రులేమో మంజూరు చేస్తారు.. కానీ వారికి డబ్బులు విడుదల చేసే అధికారం లేదు. మంజూరు చేసేందుకు మళ్లీ వాళ్లు ఆర్థిక శాఖ మంత్రి చుట్టూ తిరగాల్సి వస్తుంది. అంటే ఈ మంత్రులు కూడా వాళ్ల దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. మంత్రులు పేరుకే.. వారంతా ఆర్థిక శాఖ మంత్రి చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు.
మేం తిరిగినట్టుగా.. వాళ్ల డబ్బులు.. వాళ్ల శాఖ డబ్బులు.. ఒక్క పని అవడం లేదు. ఒక్క కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదు. ఎవరూ ముందుకు రావడం లేదు..ఉన్న డబ్బులు కొద్దికొద్దిగా ఇస్తుర్రా అంటే లేదు.. అదేమంటే డబ్బుల్లేవంటారు.. డబ్బుల్లేవన్నప్పుడు బడ్జెట్ ఎందుకు పెట్టారు.. ఎంతో కొంత ఉంది కదా.. నీ ప్రాధాన్యతలేంటి..? ఆ డబ్బులు వీటికివ్వడం లేదు.. మీ ప్రాధాన్యతలు ఎక్కడో ఉన్నయంటూ ఆరోపించారు.

