తాజావార్తలు
లగ్జరీ కారులో రయ్యిమంటూ దూసుకుపోతున్న అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అర్జున్ ఇటీవల తన ఫ్యామిలీతో దుబాయ్ టూర్ వేసిన సంగతి తెలిసిందే. అక్కడ తన భార్య స్నేహా రెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి దిగిన పిక్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌కు మంచి థ్రిల్ కలిగించారు. దుబాయ్ టూర్ పూర్తి కావడంతో బన్నీ బుధవారం రోజు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుండి తన రేంజోవర్ కారుని స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళారు బన్నీ. ఇందుకు సంబంధించి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, బన్నీ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం కేరళ వెళ్లనున్నారు. పాన్ ఇండియా లెవెల్లో మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం సెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 13న విడుదల కానుంది. రష్మిక కథానాయికగా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ బాణీలు సమకూరుస్తున్నారు.