Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Last Man in Tower | మనోజ్ బాజ్‌పేయ్ 'లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్' ట్రైలర్ విడుదల!

Last Man in Tower | మనోజ్ బాజ్‌పేయ్ 'లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్' ట్రైలర్ విడుదల!

బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సంచలన చిత్రం 'లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్' (Last Man in Tower). బోమన్ ఇరానీ, దివ్య దత్తా కీలక పాత్రలు పోషిస్తుండగా..

ఈ సినిమాకు బెన్ రెక్హి దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు రానా దగ్గుబాటికి చెందిన ‘స్పిరిట్ మీడియా’ సంస్థ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. బుకర్ ప్రైజ్ విజేత అరవింద్ అడిగ రచించిన అత్యంత ప్రసిద్ధ బెస్ట్ సెల్లర్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

ముంబై నగరంలోని విశ్రామ్ సొసైటీలో నివసించే యోగేష్ మిశ్రా (మాస్టర్ జీ) అనే రిటైర్డ్ స్కూల్ టీచర్ చుట్టూ ఈ కథ పూర్తిగా తిరుగుతుంది. నగరంలో పెరుగుతున్న రియల్ ఎస్టేట్ మాఫియా ఒత్తిళ్లు, సొంత అపార్ట్‌మెంట్‌ను కాపాడుకునేందుకు యోగేష్ మిశ్రా చేసే నిశ్శబ్ద పోరాటం ఈ చిత్రంలో ప్రధానాంశం. సొంత సమాజం నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురైనా, తన పట్టు విడవకుండా మాస్టర్ జీ ఎలా నిలబడ్డాడనే అంశం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది. బలమైన కంటెంట్, అద్భుతమైన నటనకు ప్రాధాన్యత ఉన్న ఈ సినిమాను సెప్టెంబర్ 11వ తేదీన థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana