Friday, 30 Oct, 1.44 am నమస్తే తెలంగాణ

తాజావార్తలు
మధ్యవర్తులతో పనిలేదు

  • ధరణి పోర్టల్‌ ప్రారంబాన్ని టీవీలో వీక్షించిన కలెక్టర్‌ వెంకట్రావు

మహబూబ్‌నగర్‌ : భూ క్రయవిక్రయాలకు సంబంధించి ఇకపై మధ్యవర్తులతో ఎలాం టి పని లేకుండా నేరుగా అమ్మకాలు, కొనుగోలు వారితోపాటు తాసిల్దార్‌ ఉంటే చాలని క లెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు అన్నారు. గురువారం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో అధికారుల తో కలిసి సీఎం కేసీఆర్‌ మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లిలో ధరణి పోర్టల్‌ ప్రారంభిస్తున్న కార్యక్రమాన్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ ధరణి ప్రజలకు ఎంతో పారదర్శకంగా రిజిస్ట్రేషన్‌ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలియజేశారు. రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలనుకునే వారికి ధరణి అందుబాటులో ఉందని కలెక్టర్‌ తెలియజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సీతారామారావు, తేజస్‌నందలాల్‌, ఆర్డీవో శ్రీనివాసులు ఉన్నారు.

లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద ఆడబిడ్డల పెండ్లిలకు జిల్లా వ్యాప్తంగా ఇప్ప టి వరకు 2411 మందికి రూ.27 కోట్ల 96లక్షల 76వేల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్‌ అన్నారు. జిల్లాలో వివిధ దశల్లో మరో 1150 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, అందుకు ప్రభుత్వం రూ.కోటి 41 లక్షలను విడుదల చేసినట్లు కలెక్టర్‌ తెలిపా రు. వచ్చిన దరఖాస్తులకు పూర్తి స్థాయిలో నిధులు చేసినప్పటికీ మరిన్ని నిధులు ఈ పథకాల కింద మిగులు ఉంటాయన్నారు.

వీధి దీపాలు ఏర్పాటు చేయాలి

గ్రామాల్లో మెరుగైన ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాలు చేయాలని కలెక్టర్‌ అన్నారు. జిల్లాల్లోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈఈసీఎల్‌ హైదరాబాద్‌ వారి ద్వారా 7 ఏండ్ల కాలానికి సంబంధించి పూర్తి నిర్వహణ బాధ్యత, వారెంటితో ఒప్పదం చేసుకున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో ఈఈఎస్‌ఎల్‌ తరుఫున సాయిరాం, మహబూబ్‌నగర్‌ ఇన్‌చార్జి అమర్నాథ్‌రెడ్డి ఉన్నారు.

31 మంది విద్యార్థినీల ఎంపిక

ఉమ్మడి జిల్లా చరిత్రలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశముఖ్‌ ప్రభు త్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలకు 31 మంది విద్యార్థినులు ఎంపిక కావడం గొప్ప విషయమని కలెక్టర్‌ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర సంక్షేమ శాఖ నుంచి సమాచారం అందింద ని, ఈ నెల 31న కళాశాలలో రిపోర్టు చేయనున్నట్లు వెల్లడించారు. 2008 నుంచి ప్రవేశాలకు అవకాశాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్కరూ కూడా ప్రవేశం పొందలేదన్నారు. ఈ ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా విద్యార్థినీలకు సీట్లు కల్పించాలనే సంకల్పం తో ముందుకు సాగడం జరిగిందని, అనుకున్న విధంగా సీట్లు సాధించడం జరిగిందన్నారు. ఉమ్మడి జిల్లాలో కేజీబీవీ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసుకున్న అనాథలు, ఎలాంటి ఆధారం లేని విద్యార్థినీలను గుర్తించి వారి వివరాలను ధ్రువపత్రాలతో ఒక్క రోజులోనే సే కరించి హైదరాబాద్‌కు నివేధించడం జరిగిందన్నారు. జిల్లా సంక్షేమ, విద్యాశాఖల ఉమ్మడి కృషి వల్ల ఇది సాధ్యం అయిందన్నారు. అందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కలెక్టర్‌ అభినందనలు తెలియజేశారు. కళాశాలలో కేవలం 162 సీట్లు మాత్రమే ఉంటాయని, ఉమ్మడి జిల్లా నుంచి 31 సీట్లు పొందడం చాలా గొప్ప విషయమన్నారు.

కలెక్టర్‌కు వినతి

జిల్లా కేంద్రంలోని బీసీ సడీ సర్కిల్‌లో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల్లో అవకతవకాలు జరిగాయని, ఈ విషయంపై విచారణ చేయించాలని కలెక్టర్‌ను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అ ధ్యక్షుడు గోపాల్‌యాదవ్‌ వినతిపత్రం అందజేశారు. నైట్‌ వాచ్‌మన్‌కు అవుట్‌సోర్సింగ్‌ ఉ ద్యోగం కల్పించడంలో నిబంధనలు ఉల్లంఘించారని, ఈ విషయంపై విచారణ చేసి తగిన న్యాయం చేయాలన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top