Friday, 21 Jun, 1.13 am నమస్తే తెలంగాణ

హైదరాబాద్‌
మహా నగరం.. సంగీత సాగరం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: స్వర లేదా వాయిద్య శబ్దాల రూపం, సామరస్యం, అందమైన భావోద్వేగాల వ్యక్తీకరణ వెరసీ సంగీతమవుతోంది. రాత పూర్వకమైన లేదా ముద్రితమైన సంకేతాలు స్వర లేదా వాయిద్య ధ్వనులను సూచిస్తున్నాయి. సంగీతం ఒక సాగరం లాంటిది. హిందుస్థానీ, కర్ణాటక సంగీతాలు దేశంలోనే అత్యుత్తమమైనవి. ఉత్తర భారత దేశమంతా హిందుస్థాని సంగీతాన్ని ప్రామాణికంగా తీసుకుంటుండగా, దక్షణ భారత దేశమంతా కర్టాటక సంగీతాన్ని నేర్చుకుంటూ, దానినే ప్రామాణికంగా తీసుకుంటోంది. ప్రధానంగా దక్షణ భారతంలోని తెలుగు రాష్ర్టాలకు సంబంధించినంత వరకు అన్నమయ్య, భద్రాచల రామదాసు, క్షేత్రయ్య, త్యాగరాజు, సారంగపాణి వంటి స్వరకర్తలు సంగీత రంగంలో మార్గదర్శకులు.
Top