Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'మైసా'లో నక్సలైట్‌గా?

'మైసా'లో నక్సలైట్‌గా?

గ్ర కథానాయిక రష్మిక మందన్న నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ 'మైసా' నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో రష్మిక ఫెరోషియస్‌ లుక్స్‌తో సర్‌ప్రైజ్‌ చేసింది.

ఈ సినిమాలో ఆమె గోండు తెగకు చెందిన గిరిజన మహిళ పాత్రను పోషిస్తున్నది. కెరీర్‌లో తొలిసారి ఫుల్‌లెంగ్త్‌ యాక్షన్‌ రోల్‌చేస్తుండటంతో ఈ సినిమా విషయంలో రష్మిక మందన్న ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఆమె నక్సలైట్‌ పాత్రలో కనిపించనుందని తెలిసింది. వ్యవస్థపై ధిక్కార స్వరం వినిపించే ధీరోదాత్తురాలైన గిరిజన మహిళగా ఆమె పాత్ర అత్యంత శక్తివంతంగా సాగుతుందని చెబుతున్నారు. అయితే ఆమె పాత్ర తాలూకు అసలైన వివరాలు తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. పాన్‌ ఇండియా రిలీజ్‌ కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana