Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Man Rapes 80 Year Old Woman | 80 ఏళ్ల వృద్ధురాలిపై.. పొరుగు వ్యక్తి అత్యాచారం

Man Rapes 80 Year Old Woman | 80 ఏళ్ల వృద్ధురాలిపై.. పొరుగు వ్యక్తి అత్యాచారం

క్నో: పొరుగున నివసించే వ్యక్తి, 80 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు రావడం చూసి అతడు పారిపోయాడు. రక్తస్రావంతో ఉన్న ఆ వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించారు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. (Man Rapes 80 Year Old Woman) ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో 80 ఏళ్ల వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని పొరుగున నివసించే 26 ఏళ్ల వ్యక్తి గమనించాడు. బలవంతంగా ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

కాగా, ఆ వృద్ధురాలు సహాయం కోసం కేకలు వేసింది. దీంతో స్థానికులు అక్కడకు రావడంతో ఆ వ్యక్తి పారిపోయాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. రక్తస్రావంతో బాధపడుతున్న బాధితురాలిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత నిందితుడైన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వృద్ధురాలి కుటుంబం ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana