విజయవాడ,9మే : మణిపాల్ హాస్పిటల్, విజయవాడ విజయవంతంగా 20ఏండ్ల బీకామ్ విద్యార్థి ఈశ్వర్ సాయి గణేష్‌కు హప్లోఐడెంటికల్ బోన్‌మారో మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించింది. సాధారణంగా ఈ ప్రక్రియలో డాక్టర్లు కుటుంబ దాత నుంచి పూర్తిగా సరిపోలిన హెచ్‌ఎల్‌ఏకు బదులుగా సగం సరిపోలిన హ్యూమన్ ల్యుకోసైట్ యాంటీజెన్ (హెచ్‌ఎల్‌ఏ)ను తల్లిదండ్రులు లేదంటే తోడబుట్టిన వారి నుంచి సేకరిస్తారు. ఇలా చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహా మార్పిడి శస్త్ర చికిత్స చేసిన మొట్టమొదటి ఆస్పత్రిగా మణిపాల్ హాస్పిటల్ నిలిచింది.
ఈ మార్పిడి శస్త్రచికిత్స గురించి క్యాన్సర్ వైద్య , మూలకణ మార్పిడి నిపుణులు డాక్టర్ మాధవ్ దంతాల మాట్లాడుతూ ''ఈ రోగికి 2016లో టీ-లింపోబ్లాస్టిక్ లింఫోమాను గుర్తించడం జరిగింది.
దీనికి అతని జబ్బు బాగా తగ్గింది. ఒకసారి వ్యాధి నియంత్రణలోకి వచ్చిన తరువాత మేము హప్లోఐడెంటికల్ (సగం -సరిపోలిన) మూలకణ మార్పిడి శస్త్రచికిత్స చేశాం. తద్వారా ఈ రోగిలో మరలా ఈ వ్యాధి తిరగబెట్టే అవకాశాలు ఉండవు. ఈ చికిత్స కోసం ఈ రోగి తన తండ్రి కోయ శ్రీనివాసరావు నుంచి స్టెమ్ సెల్‌ను పొందారు'' అని అన్నారు.

