Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Manne krishank | ఇజ్రాయెల్‌ ఇన్నోవేషన్ అథారిటీ నుంచి మనకేమన్నాపెట్టుబడులు వచ్చినయా..? : మన్నె క్రిశాంక్

Manne krishank | ఇజ్రాయెల్‌ ఇన్నోవేషన్ అథారిటీ నుంచి మనకేమన్నాపెట్టుబడులు వచ్చినయా..? : మన్నె క్రిశాంక్

Manne krishank | రేవంత్‌ రెడ్డి ఈ సంవత్సరంలోనే దావోస్‌కు వెళ్లినప్పుడు ఇజ్రాయెల్‌ ఇన్నోవేటివ్‌ అథారిటీ వాళ్లను కలిశారు. నిజంగానే ఇజ్రాయెల్‌ ఇన్నోవేటివ్‌ అథారిటీ నుంచి మనకేమన్నా పెట్టుబడులు వచ్చినయా..?

తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా అంటే శూన్యమని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అన్నారు.

తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదు.. కానీ ఒక్క కంపెనీతో మాత్రం ఒప్పందం చేసుకున్నరు. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇంత కష్టపడి ఇక్కడి నుంచి ఫారిన్‌కు వెళ్లి ఇజ్రాయెల్‌ అధికారులను కలిస్తే వాళ్లు చేసుకున్న ఒప్పందం టెసరాక్ట్‌ అడ్వాన్స్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.

రేవంత్ రెడ్డి చెప్తే ఇజ్రాయెల్ వాళ్లు కొండల్ రెడ్డి కంపెనీ అయిన టెస్సెరాక్ట్‌తో ఒప్పందం చేసుకున్నారు. అప్పుడే ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారితో రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి కూడా భేటీ అయ్యాడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టెస్సెరాక్ట్ కంపెనీకి తక్కువ ధరలో భూములు కట్టబెడితే.. శ్రీధర్ బాబు వచ్చి కొండల్ రెడ్డికి, టెస్సెరాక్ట్ కంపెనీకి సంబంధం లేదు అని అంటున్నాడు. కొండల్ రెడ్డి ఇప్పుడు ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ అనే కొత్త కంపెనీకి కూడా చైర్మన్ అయ్యాడు.. ఆయన అంత పెద్ద సైంటిస్టా మరి..? అని ప్రశ్నించారు.

ఇజ్రాయెల్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్న రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి. ఇజ్రాయెల్‌తో ఒప్పందం ఎలా చేసుకుంటారని మోదీని రాహుల్ గాంధీ ప్రశ్నించాడు. మరి మీ ముఖ్యమంత్రి తమ్ముడు ఇజ్రాయెల్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు అనుముల కొండల్ రెడ్డి, ఫహీం కురేషి విదేశీ పర్యటనలకు వెళ్లి అక్కడ ఏం వ్యాపారాలు చేస్తున్నారో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు.

తెలంగాణకు ఏమో ఒక్క కంపెనీ రాదు.. రేవంత్ రెడ్డి తమ్ముడు అనుముల కొండల్ రెడ్డి ఏ దేశానికి పోయినా ఆయనతో మాత్రం అక్కడ అధికారులు ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. హవాలానా, షెల్ కంపెనీలా, నల్లధనమా.. దేనికోసం వెళ్తున్నారో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana