Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మంత్రి మల్లారెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించం

మంత్రి మల్లారెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించం

ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే గుణపాఠం తప్పదు..
సర్కారు చేస్తున్న మంచిపనులపై విమర్శలా..?
బీజేపీ నేతపై ధ్వజమెత్తిన బోర్డు మాజీ సభ్యులు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌

కంటోన్మెంట్‌, మే 5 : మంత్రి చామకూర మల్లారెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని కంటోన్మెంట్‌ బోర్డు మాజీ సభ్యులు, బోయిన్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ టీఎన్‌ శ్రీనివాస్‌ బీజేపీ నేతలను హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్‌, లోక్‌నాథం, నళినికిరణ్‌, భాగ్యశ్రీతో పాటు మార్కెట్‌ కమి టీ చైర్మన్‌ శ్రీనివాస్‌లు బీజేపీ నేత రామకృష్ణపై ధ్వజమెత్తారు.

స్వయం కృషితో ఎదిగిన మంత్రి మల్లారెడ్డిపై కా వాలనే కబ్జా ఆరోపణలు చేస్తున్నారని, మరోసారి ఇలాం టి ఆరోపణలు గుప్పిస్తే తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ భిక్ష వల్లే ఈ స్థాయికి ఎదిగిన రామకృష్ణ గతాన్ని ఓ సారి గుర్తు చేసుకోవాలని హితవు పలికారు.

మల్లారెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో రక్షణశాఖ మంత్రి వద్ద కు తీసుకెళ్లాలని పట్టుబట్టినప్పు డు గుర్తుకురాలేదా అని ఆరోపించారు. మూడేళ్లకు పైగా ఉపాధ్యక్షుడిగా కొనసాగిన వ్యక్తికి కంటోన్మెంట్‌ గురించి తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. పాలు అమ్మి స్వయం కృషితో ఎదిగిన మంత్రి మల్లారెడ్డి పై నోరు పారేసుకుంటే జాగ్రత్త అంటూ రామకృష్ణను హె చ్చరించారు. కరోనా కట్టడికి రా ష్ట్ర ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పని చేస్తుంటే వాటిపైనా విమర్శించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. బీజేపీ ప్రాంత రాష్ర్టాల్లో కరోనా విజృంభిస్తుంటే అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్న విష యం కనబడటం లేదా అని ప్రశ్నించారు. మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడాలని, ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌లు దేవులపల్లి శ్రీనివాస్‌, మహంకాళి శర్విన్‌, అరుణ్‌యాదవ్‌ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana