Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మనుషులకే కాదు పిల్లికి కూడా ఓటు హక్కు! ఎక్కడంటే..

మనుషులకే కాదు పిల్లికి కూడా ఓటు హక్కు! ఎక్కడంటే..

మనుషులు ఓటు హక్కు సంపాదించుకోవడానికే నానాతంటాలు పడుతున్నారు. అలాంటిది ఓ పిల్లి ఓటు సంపాదించుకున్నది. అది కూడా చనిపోయిన 12 ఏండ్లకు. అయినా పెట్స్ ఓటు ఎలా వేస్తాయి. సరైన నాయకుడిని ఎలా ఎంచుకుంటాయి అనే సందేహాలు మైండ్‌లో తిరుగుతూనే ఉంటాయి. ఈ సంఘటన అట్లాంటాలో చోటు చేసుకున్నది.

ఓటు హక్కు ధరఖాస్తు పెట్టుకున్నది పిల్లే. ఆ పిల్లి ధరఖాస్తులో పేర్కోన్న అడ్రస్‌లోని వ్యక్తులకు అధికారులు ఫోన్ చేసి కనుక్కున్నారు. ఆ పిల్లి తమదేనని, 12 ఏళ్ల కిందట అది చనిపోయిందని అవతలి వ్యక్తి చెప్పారు. అయితే, ఆ దరఖాస్తు పంపింది తాము కాదని కూడా చెప్పారు. గత కొన్నాళ్లుగా థర్డ్‌ పార్టీ సామాజిక వేత్తలు కొందరు ఇతర జీవులకు కూడా ఓటు హక్కు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

పెంపుడు జంతువులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని అంటున్నారు. పిల్లితోపాటు కుక్కలు, ఎలుకలు, పాములకు కూడా ఓటు హక్కు కల్పించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, ఈ పప్పులేం కుదరవని కుండ బద్దలు కొట్టినట్లు అధికారులు చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana