లాస్‌ఏంజిల్స్ : గోల్ఫ్ సూపర్‌స్టార్ టైగర్ వుడ్స్‌ను లాస్ ఏంజిల్స్ వైద్య సదుపాయానికి తరలించినట్లు హార్బర్ - యూసీఎల్‌ఏ మెడికల్ సెంటర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. గత మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. లాస్‌ఏంజిల్స్‌లోని రోలింగ్ హిల్స్ ఎస్టేట్ సమీప సబర్బన్ రహదారిపై ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న సమయంలో ఎస్‌యూవీ కారు డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొడుతూ ఏకంగా రెండు లైన్ల రహదారిని దాటి పక్కనే పడిపోయింది. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ ఫైటర్స్ కారు అద్దాలు పగులగొట్టి ఆయనను బయటకి తీసుకువచ్చి, హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

