Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mayank Agarwal | కౌంటీల్లో భారతీయం.. నిన్న నబీ, ఈరోజు మయాంక్..!

Mayank Agarwal | కౌంటీల్లో భారతీయం.. నిన్న నబీ, ఈరోజు మయాంక్..!

Mayank Agarwal : ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్‌ (County Championship)లో ఆడేందుకు భారత ఆటగాళ్లు అమితాసక్తి చూపిస్తున్నారు. గతంలో కపిల్ దేవ్, సచిన్ టెండ్కూర్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, ఛతేశ్వర్ పుజారాలు ఈ టోర్నీలో తళుక్కుమన్నారు.

ఈమధ్య యువ స్పిన్నర్ రాహుల్ చాహర్, తిలక్ వర్మలు కౌంటీల్లో మెరవగా.. 2026 సీజన్‌లో మరో ఇద్దరు ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే పేసర్ అస్త్రం అకీబ్ నబీ(Auqib Nabi) సర్రే జట్టు తరఫున అరంగేట్రం చేయనుండగా.. మయాంక్ అగర్వాల్(Mayank Agarwal) సైతం ఈ లీగ్‌లో ఆడనున్నాడు.

విదేశీ లీగ్స్‌లోనే కాదు అక్కడి ఫస్ట్ క్లాస్ క్రికెటలోనూ భారత ఆటగాళ్లు మెరుస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాటుదేలడం కోసం ఈమధ్య మనోళ్లు ఇంగ్లండ్‌లో వాలిపోతున్నారు. అక్కడి కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఆడుతూ తమ నైపుణ్యాలను మెరుగుపరచుకుంటున్నారు. రెండు రోజుల క్రితమే పేసర్ అకీబ్ నబీ కౌంటీల్లో సర్రే జట్టుకు ఆడడం ఖరారైంది. తాజాగా మయాంక్ అగర్వాల్ సైతం ఈ టోర్నీలో ఆడనున్నాడు. టెస్టుల్లో ఓపెనింగ్.. దేశవాళీ క్రికెట్‌ అనుభవమున్న ఈ కర్నాటక బ్యాటర్‌తో డుర్హం జట్టు తాత్కాలిక ఒప్పందం చేసుకుంది. అతడు నాలుగు మ్యాచులు ఆడే అవకాశముదని డుర్హం కోచ్ రియాన్ క్యాంప్‌బెల్ పేర్కొన్నాడు.

‘కౌంటీ చాంపియన్‌షిప్‌లో మా జట్టుకు మయాంక్ ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది. మయాంక్ ఎంతో ప్రతిభావంతుడు. అతడి ఫస్ట్ క్లాస్ రికార్డు అద్భుతం. ఈ మెగా టోర్నీలో డుర్హం విజయాల్లో అతడు కీలకం అవుతాడని ఆశిస్తున్నాం’ అని క్యాంప్‌బెల్ వెల్లడించాడు. తదుపరి నాలుగు మ్యాచుల్లో సెప్టెంబర్ 2వ తేదీన నార్తంప్టన్‌షైర్, సెప్టెంబర్ 8న మిడిలెక్స్, సెప్టెంబర్ 15న వొర్సెస్టర్‌షైర్, సెప్టెంబర్ 24న ల్యాంక్‌షైర్‌ జట్లతో డుర్హం తలపడనుంది.

కౌంటీల్లో ఆడినందుకు భారత ఆటగాళ్లకు దాదాపు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు పైగా సంపాదిస్తారని సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీన మొదలైన కౌంటీ ఛాంపియన్‌షిప్‌ సీజన్ సెప్టెంబర్ 27న ముగియనుంది. కపిల్ దేవ్‌ 1980లో సోమర్‌సెట్‌కు.. సచిన్ 1992లో యార్క్‌షైర్, అనిల్ కుంబ్లే 1995లో నార్తంప్టన్‌షైర్‌కు, ద్రవిడ్ 2000లో కెంట్ జట్టుకు, గంగూలీ ల్యాంక్‌షైర్, గ్లమోర్గన్‌ జట్లకు.. పుజారా2015లో యార్క్‌షైర్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana