Dailyhunt
మెగా కాంపౌండ్ నుండి మరో హీరో.. !

మెగా కాంపౌండ్ నుండి మరో హీరో.. !

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చిరంజీవి వేసిన బాటలో ఆ ఫ్యామిలీ నుండి పవన్ కళ్యాణ్‌, నాగబాబు అల్లు అర్జున్, రామ్ చరణ్‌, అల్లు శిరీష్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, కళ్యాణ్ దేవ్ వంటి వారు నడుస్తూ వస్తున్నారు. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్నారు. రీసెంట్‌గా ఉప్పెన సినిమాతో వైష్ణవ్ తేజ్ డెబ్యూ హీరోగా పరిచయం అయ్యాడు. వీలు చూసుకొని నిహారిక భర్త కూడా త్వరలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

మెగా కాంపౌండ్ నుండి మరో హీరో రాబోతున్నట్టు గతంలో చెప్పుకున్నాం. రీసెంట్‌గా ఆయన చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది.

అయితే హీరో ఎవరనే విషయానికి వస్తే అతను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బావమరిది కొడుకు ముత్తంశెట్టి విరాన్ . బతుకు బస్టాండ్ అనే సినిమాతో విరాన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా జూన్ 11న విడుదల కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana