Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Megastar Chiranjeevi | సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు.. తమ్ముడికి మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ బర్త్‌డే విషెస్

Megastar Chiranjeevi | సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు.. తమ్ముడికి మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ బర్త్‌డే విషెస్

Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పవన్ కల్యాణ్‌ను “సంకల్ప సాధకుడు” అంటూ సంబోధిస్తూ చిరంజీవి రాసిన భావోద్వేగ లేఖ నెట్టింట ప్రస్తుతం వైరల్‌గా మారింది.

తమ్ముడు పవన్‌లో చిన్నప్పటి నుంచే నిబద్ధత, ప్రజలకు మంచి చేయాలనే తపన తాను చూస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు. కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తారో, తనను నమ్మిన ప్రజల పట్ల కూడా పవన్ అంతే వాత్సల్యం చూపుతారని కొనియాడారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ కోసం పవన్ అంకితభావంతో పనిచేస్తున్న తీరు తనలో ఎంతో గర్వాన్ని కలిగిస్తోందని చిరు తెలిపారు. పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిలా కాకుండా కుటుంబ సభ్యుడిగా అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు. పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ, ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన లక్ష్యాలను సాధించాలని శ్రీ ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొంటూ “ఇట్లు మీ అన్నయ్య చిరంజీవి” అంటూ ఆప్యాయంగా బర్త్‌డే విషెస్ అందజేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana