Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెకానిక్‌ షెడ్డులో అగ్నిప్రమాదం

మెకానిక్‌ షెడ్డులో అగ్నిప్రమాదం

కుత్బుల్లాపూర్‌, మే 29: సుభాష్‌నగర్‌ డివిజన్‌ పైపులైన్‌ రోడ్డు మార్గంలో ఉన్న ఓ మెకానిక్‌ కారు షెడ్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది.

తిరుమల వైన్స్‌ ఎదురుగా ఉన్న ఓ కారు మెకానిక్‌ షెడ్డులో కరెంటు షార్ట్‌సర్యూట్‌తో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.

అప్పటికే మెకానిక్‌ షెడ్డులోని కొన్ని కార్లు స్వల్పంగా కాలిపోవడంతోపాటు ఆ ప్రాంతమంతా పొగ కమ్మేయడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాగా ప్రమాదం జరిగిన మెకానిక్‌ షెడ్డుకు ఆనుకొని ఒక ఐదంతస్తుల భవనంతోపాటు ఫర్నిచర్‌ దుకాణం, ఇతర షాపులు ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరి మంటలు ఆర్పేయడంతో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఘటనపై పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana