వరంగల్ : వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కనీస సౌకర్యాలులేకపోవడంతో రోగులు, వారి తరపు బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ చిన్నారి నడుస్తుండగా సెలైన్ బాటిల్ పట్టుకొని ఓ మహిళ నడుస్తున్న దృశ్యం పరిస్థితికి అద్దంపడుతున్నది.
స్టాండ్లు లేక సెలైన్ బాటిల్ గోడకు వేలాడదీయాల్సిన దుస్థితి కొనసాగుతున్నది. అలాగే ఫ్యాన్లు లేక రోగుల బంధువులు ఇంటి దగ్గర నుంచి ఛార్జింగ్ ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం అధికారులు ఇప్పటికైనా మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు.

