Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మోదీ ట్విట్టర్ ఫాలోవర్స్ @ 70 మిలియన్స్‌

మోదీ ట్విట్టర్ ఫాలోవర్స్ @ 70 మిలియన్స్‌

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 70 మిలియన్ మార్క్‌ను చేరింది. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నవారిలో క్రియాశీల రాజకీయ నేతల్లో ఒకరిగా ప్రధాని మోదీ నిలిచారు. రాజకీయ ప్రసంగాలతో మోదీ ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్‌ను పెంచుకున్నారు. 2009లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు. 2010లో లక్ష మంది ఫాలోవర్స్ చేరగా.. 2011 నవంబర్‌లో ఫాలోవర్స్ సంఖ్య 4 లక్షలకు పెరగ్గా.. ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం భారీగా పెరిగారు. మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి తన ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. ప్రతి విషయాన్ని ప్రజలతో పంచుకోవడంతో పాటు సందేశాలతో పాటు సూచనలతో పాటు ప్రభుత్వ పథకాలపై ట్విట్టర్ వేదికగా వివరిస్తూ వస్తున్నారు.

మోదీ తర్వాత పోప్‌ ఫ్రాన్సిస్‌ ట్విట్టర్‌ ఖాతాను 53 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు 30.9 మిలియన్లు, మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు 129.8 మిలియన్లు, ఫాలోవర్స్‌ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు 7.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమిత్‌షాకు 26.3 మిలియన్ల మంది, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి 19.4 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాను ట్విట్టర్‌ యూఎస్‌ క్యాపిటల్‌ వద్ద జరిగిన అల్లర్ల నేపథ్యంలో శాశ్వతంగా తొలగించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు 88.7 మిలియన్స్‌ ఫాలోవర్లు ఉన్నారు.

ఇవి కూడా చదవండి..

115 కొత్త జన్యుకణాల గుర్తింపు

ఏలియన్స్‌ కోసం ఏఐతో అన్వేషణ

భారత్‌కు విమానాలు నిలిపివేసిన ఎతిహాద్‌

శ్రీశైలానికి భారీగా వరద.. ఏడు గేట్ల ఎత్తివేత

కొవిషీల్డ్‌ రెండో డోసు తర్వాత ఆ సమస్య ఉండదు..!

కృష్ణజింకల సందడి.. వీడియో ట్వీట్‌ చేసిన ప్రధాని

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana