Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మొక్కజొన్నలను వెంటనే తరలించాలి

మొక్కజొన్నలను వెంటనే తరలించాలి

  • లోడింగ్‌ ప్రక్రియలో జాప్యం వద్దు..
  • జూలూరుపాడు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌ అంకిత్‌

జూలూరుపాడు, మే 29 : కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద ప్రభుత్వం కొనుగోలు చేసిన మొక్కజొన్నలను వెంటనే గోదాములకు తరలించాలని, లోడింగ్‌ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరుగవద్దని కలెక్టర్‌ అంకిత్‌ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం జూలూరుపాడు మండల కేంద్రంలోని మొకజొన్న కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. నిల్వలను తనిఖీ చేసి గత రాత్రి కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న బస్తాలు తడవకుండా అధికారులు తీసుకున్న జాగ్రత్తలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రంలో ముందుగానే అందుబాటులో ఉంచిన టార్పాలిన్లతో పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టడం వల్ల రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని వ్యవసాయశాఖ, సహకార సంఘం అధికారులు తెలపడంతో కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తంచేశారు.

ప్రస్తుతం కేంద్రంలో నిల్వ ఉన్న 3,600 మొకజొన్న బస్తాలను సాయంత్రంలోగా లోడింగ్‌ ప్రక్రియ పూర్తిచేసి తరలిస్తామని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అంకిత్‌ మాట్లాడుతూ ఎన్ని లారీల్లో లోడింగ్‌ ప్రక్రియ జరిగింది, ఇప్పటివరకు ఎంత మొత్తంలో మొకజొన్నను గోడౌన్‌లకి తరలించారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు సుమారు 28వేల బస్తాలను గోదాములకు తరలించినట్లు సంబంధిత అధికారులు నివేదించారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. అనంతరం మొకజొన్నల నాణ్యత, తేమశాతాన్ని పరిశీలించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో రవి, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, మారెటింగ్‌, సివి ల్‌ సైప్లె, వ్యవసాయశాఖల అధికారులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana