Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మొక్కల పెంపకంతో ఆరోగ్యవంతమైన జీవనం

మొక్కల పెంపకంతో ఆరోగ్యవంతమైన జీవనం

- చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు

చండూరు జూలై 07 : ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడం వల్ల స్వచ్ఛమైన గాలి లభించి ఆరోగ్యమైన జీవితం అనుభవించవచ్చని చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు అన్నారు.

మంగళవారం చండూరు మున్సిపాలిటీలోనీ 10వ వార్డులో ఇంటింటికి హోమ్‌స్టెడ్ మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. "వన మహోత్సవం – 2026" కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, ప్రతి ఇంటి ఆవరణలో పండ్ల, ఔషధ, నీడనిచ్చే మొక్కలను పెంచే లక్ష్యంతో చండూరు మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో ఇంటింటికి హోమ్‌స్టెడ్ మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. ప్రజలు మొక్కలను తమ ఇంటి ఆవరణలో నాటి, వాటిని సంరక్షించి చండూరు మున్సిపాలిటీని ఆకుపచ్చ వనం లాగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని ఆయన ప్రజలను కోరారు.

మొక్కలు పర్యావరణ సమతుల్యతను కాపాడటమే కాకుండా, స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన జీవనానికి దోహదపడతాయని తెలిపారు. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం మాట్లాడుతూ చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో కూడా హోమ్‌స్టెడ్ మొక్కల పంపిణీ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిల్ సభ్యులు బుషిపాక వాసు, సామ సుజాతయాదవ రెడ్డి, జెల్ల ధనమ్మ శ్రీనివాస్, కొన్‌రెడ్డి మధు, కోడి సుష్మ వెంకన్న, కటకం రమేష్, కో-ఆప్షన్ సభ్యులు మొగుదాల సత్తమ్మ వెంకన్న, షేక్ ఖలీల్, షేక్ సలీమా షరీఫ్, మేనేజర్ జి.రాములు, సీనియర్ అసిస్టెంట్ ఏ. సాయిభారద్వాజ్, వార్డ్ ఆఫీసర్లు జి.శ్రీరాములు, ఎ.జగన్, బి. సాయిరాం, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ ఎం.అరవింద్ రెడ్డి, బిల్ కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana