Dailyhunt
Moosi: 2 గేట్ల ద్వారా మూసీ నీటి విడుదల

Moosi: 2 గేట్ల ద్వారా మూసీ నీటి విడుదల

కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా శనివారం దిగువకు నీటి విడుదల కొనసాగింది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 2972.25 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. రెండు క్రస్టు గేట్ల ద్వారా 3743.44 క్యూసెక్కులు, కుడి ప్రధాన కాలువకు 189.47 క్యూసెక్కులు, ఎడమ ప్రధాన కాలువకు 213.25 క్యూసెక్కులు వెళుతుంది.

మొత్తం 4245.50 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతుంది.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 642.30 అడుగులుగా (3.76 టీఎంసీలు) ఉన్నట్లు ఏఈ డి.ఉదయ్‌కుమార్ తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana