
హైదరాబాద్: మాయ మాటలతో మోసాలకు పాల్పడుతున్న రెండు ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును శంషాబాద్ ఎస్‌వోటీ పోలీసులు రట్టు చేశారు. రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు చేస్తున్న ఇద్దరిని ఆదీనంలోకి తీసుకున్నారు. మూడు నెలల శిక్షణ పేరుతో నకిలీ నియామక పత్రాలు ఇస్తున్నారని పోలీసులు తెలిపారు.
తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు ఇప్పిస్తామని జనాలకు టోకరా వేస్తున్న మరో ముఠాను అరెస్టు చేశారు. ముఠాలోని నలుగురు సభ్యులను శంషాబాద్ పోలీసులు ఆదీనంలో తీసుకున్నారు. రూ.లక్షల్లో వసూలు చేసి నకిలీ బంగారు బిస్కెట్లు ఇన్నారని వెల్లడించారు.
నిందుల నుంచి 5.85 కిలోల నకిలీ బంగారు బిస్కెట్లు, రూ.8 లక్షలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.