తాజావార్తలు
ముచ్చటగా మూడోసారి తల్లి కాబోతున్న వండర్ వుమన్

వండర్ వుమన్ గాల్ గాడట్ ముచ్చటగా మూడోసారి తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమే తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా చెప్పింది. భర్త యారన్ వర్సానో, తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉన్న ఓ క్యూట్ పిక్‌ను ఆమెను పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారిపోయింది. ఇప్పటికే 30 లక్షలకుపైగా అభిమానులు దీనిపై రియాక్ట్ అయ్యారు. ఈ మధ్యే వండర్ వుమన్ 1984 మూవీలో గాల్ నటించిన విషయం తెలిసిందే. వార్నర్ బ్రదర్స్ తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లతోపాటు ఓటీటీలోనూ ఒకేసారి రిలీజైంది. త్వరలోనే హెచ్బీవోలో రాబోతున్న జస్టిస్ లీగ్‌లోనూ గాల్ నటించింది.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana