వరంగల్ రూరల్ : కాశిబుగ్గ - ఆత్మకూరు డబుల్ రోడ్డు పనులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. దామెర మండలం ముస్తాలపల్లి క్రాస్ రోడ్డు వద్ద జరుగుతున్న జంక్షన్ పనులను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు లోపించకుండా పనులు చేపట్టాలన్నారు. పనుల్లో జాప్యాన్ని సహించేది లేదన్నారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తికావాలన్నారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బీ, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

