Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ తొలి హారర్ మూవీ '418'.. రిలీజ్ ఎప్పుడో తెలియక ఫ్యాన్స్‌లో పెరుగుతున్న ఆసక్తి!

Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ తొలి హారర్ మూవీ '418'.. రిలీజ్ ఎప్పుడో తెలియక ఫ్యాన్స్‌లో పెరుగుతున్న ఆసక్తి!

Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం వరుస విజయాలతో టాలీవుడ్‌లో జోరు మీద ఉంది. తాజాగా 'ఇరుముడి'తో భారీ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను అందుకున్న ఈ నిర్మాణ సంస్థ..

మరోవైపు విభిన్న కథాంశాలతో తెరకెక్కుతున్న పలు క్రేజీ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తోంది. అయితే ఈ బ్యానర్ నుంచి రాబోతున్న తొలి హారర్ థ్రిల్లర్ '418' మాత్రం ఇంకా రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. కొత్త విడుదల తేదీపై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. '418' చిత్రానికి కీర్తన్ నాగగౌడ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్‌కు బ్యాకింగ్ అందిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రీతి పగడాల కథానాయికగా నటిస్తున్నారు.

నిజానికి ఈ చిత్రాన్ని 2026 జూలై 31న థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ మొదట నిర్ణయించారు. అయితే విడుదలకు కొద్ది రోజుల ముందు అనూహ్యంగా సినిమాను వాయిదా వేశారు. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర బృందం అప్పట్లో వెల్లడించింది.అయితే జూలై చివరిలో రిలీజ్ వాయిదా పడినప్పటి నుంచి దాదాపు నెల రోజులు గడిచినా.. ఇప్పటివరకు కొత్త రిలీజ్ డేట్‌ను మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. దీంతో అసలు '418' సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మైత్రీ మూవీ మేకర్స్ పేరు టాలీవుడ్‌లో భారీ కమర్షియల్ సినిమాలతో పాటు విభిన్న కథలను తెరకెక్కించే నిర్మాణ సంస్థగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఆ బ్యానర్ నుంచి వస్తున్న తొలి హారర్ థ్రిల్లర్ కావడంతో '418'పై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది.ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన కథ, పాత్రలు, కీలకమైన అంశాలను మేకర్స్ పెద్దగా బయటకు వెల్లడించలేదు. దీంతో సినిమా కాన్సెప్ట్ ఏంటి? ఇందులో ఎలాంటి హారర్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి? అనే విషయాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి కొనసాగుతోంది. ప్రశాంత్ నీల్ పేరు ఈ ప్రాజెక్ట్‌తో అనుసంధానం కావడం కూడా సినిమాపై అంచనాలు పెరగడానికి మరో కారణంగా మారింది. కీర్తన్ నాగగౌడ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించబోతోందనేది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana