Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nagarkurnool | పిడుగుపాటుకు మూడు పశువులు మృతి

Nagarkurnool | పిడుగుపాటుకు మూడు పశువులు మృతి

నాగర్ కర్నూలు : అకాల వర్షాలతో రైతులు, పశు యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆత్మహత్యలు( Suicide) చేసుకుంటున్నారు.

మరికొందరు వడదెబ్బకు కల్లాల వద్దే ప్రాణాలు కోల్పోతున్నారు.

మరోవైపు అకాల వర్షాలతో కల్లాల్లో నిలువ ఉంచిన ధాన్యం తడిసిపోతుందని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశు యజమానులు సైతం అకాల వర్షాలు, పిడుగుపాటుతో నష్టాలపాలువుతున్నారు.

తాజాగా నాగర్‌ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లిలో శుక్రవారం భారీ వర్షానికి తోడు పిడుగుపాటు ( Lightning strike) తో మూడు పశువులు మృతి చెందాయి. బుద్ధుల శేఖర్‌( Baddula Shekar ) అనే రైతు పొలంలో కట్టేసి ఉంచగా ఈ ప్రమాదం జరిగింది. సుమారు రూ.2 లక్షల నష్టం అంచనా జరిగిందని బాధితుడు వాపోయాడు. జీవనాధారం కోల్పోయ్యాయమని, ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana