- వచ్చే నెల 25 నుంచి సమ్మర్ కోచింగ్ క్యాంపులు
- 44 రకాల క్రీడలపై పిల్లలకు శిక్షణ
సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : సమ్మర్ కోచింగ్ క్యాంపు నిర్వహణకు బల్దియా సిద్ధమవుతున్నది.
మొత్తం 44 రకాల క్రీడలపై తర్ఫీదు ఇవ్వనున్నారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, గేమ్ ఇన్‌స్పెక్టర్లు పర్యవేక్షణలో జరిగే ఈ క్రీడా పోటీలకు అవసరమైన క్రీడా సామగ్రి, కోచ్‌ల నియామకం, ప్రాంగణాలకు సంబంధించి నిర్వహణపై కసరత్తు చేస్తున్నారు.


