- ఏఐ సాయంతో కవిత
- భూమికి పంపినఉపగ్రహం
స్వాల్బర్డ్: రోదసి నుంచి కృత్రిమ మేధను నిర్వహించాలన్న తన లక్ష్యాన్ని గూగుల్ సాధించింది. ప్రాజెక్ట్ సన్క్యాచర్ నమూనా ఉపగ్రహం తన కక్ష్య నుంచి ఏఐ స్పందనను సృష్టించి భూమి మీదకు పంపింది.
ఒక డాటా సెంటర్-క్లాస్ ఏఐ చిప్ అంతరిక్షం నుంచి పని చేయడం ఇదే తొలిసారి. ఉపగ్రహం సరిగ్గా పనిచేస్తున్నదని నిర్ధారించుకొన్నాక నార్వేలోని స్వాల్బర్డ్లో ఒక గ్రౌండ్ స్టేషన్ మీదుగా అది ప్రయాణిస్తున్నప్పుడు ఇంజినీర్లు అందులోని గెమ్మా 4 అనే ఏఐ మాడల్‌కు మొదటి అసలైన ప్రాంప్ట్‌ను పంపి అంతరిక్షంలో ఉండటం గురించి ప్రాస లేని హైకూను(చిన్న కవిత) రాయమని అడిగారు. దీంతో 'కింద నీలి పాలరాయి.. నిశ్శబ్ద సౌందర్యంలో డాటా ప్రవాహాలు.. నక్షత్ర కాంతి నా ఆత్మకు పోషణ ఇస్తున్నది' అని అది బదులిచ్చింది.

