Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Naomi Osaka | టెన్నిస్ కోర్టే ఫ్యాషన్‌ వేదిక.. ఈసారి బాస్కెట్ బాల్ దిగ్గజంలా ఒసాక..!

Naomi Osaka | టెన్నిస్ కోర్టే ఫ్యాషన్‌ వేదిక.. ఈసారి బాస్కెట్ బాల్ దిగ్గజంలా ఒసాక..!

Naomi Osaka : మహిళల టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా (Naomi Osaka) ఆటతోనే కాదు తన ఫ్యాషన్ సెన్స్‌తోనూ వార్తల్లో నిలుస్తుంటుంది. గ్రాండ్‌స్లామ్ టోర్నీ అనగానే ఈ ఫ్యాషనిస్టా..

ట్రెండీ దుస్తుల్లో, ఏదైనా థీమ్‌తో కూడిన డ్రెస్‌లో వైరలవుతుంటుంది. ప్రతిసారి సరికొత్త డ్రెస్సింగ్స్‌ను ఎంచుకుంటూ తొలిరౌండ్‌ కోసం కోర్టులో అడుగుపెడుతుందీ జపాన్ ప్లేయర్. ఇప్పుడు యూఎస్ ఓపెన్‌లో ఆరంభ పోరు కోసం ఒసాకా బాస్కెట్ బాల్ దిగ్గజం లుక్‌తో వచ్చి అందర్నీ అబ్బురపరిచింది.

టెన్నిస్ కోర్టునే ఫ్యాషన్ వేదికగా మార్చేసే నవోమి ఒసాకా మరోసారి వైరలవుతోంది. యూఎస్ ఓపెన్‌ 2026 మహిళల సింగిల్స్ తొలి మ్యాచ్ కోసం ఈ జపాన్ ప్లేయర్ వెరైటీగా.. బాస్కెట్ బాల్ దిగ్గజం గెటప్‌లో వచ్చింది. అమెరికా మాజీ ఆటగాడు, ఎన్‌బీఏ గ్రేట్ అలెన్ ఐవెర్సన్‌ (Allen Iverson) మాదిరిగా కోర్టులో అడుగుపెట్టింది ఒసాక. పొడవాటి తెల్లని స్కర్ట్ దానిపై వదులుగా ఉన్న హుడీ ధరించింది. కోర్టులోకి వచ్చాక.. ఆ డ్రెస్ తీసేసిన ఒసాక.. ఐవెర్సన్‌ లుక్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచింది.

అచ్చం అమెరికా వెటరన్ స్టయిల్లో తన జట్టును కార్న్ రోస్ తరహాలో డిజైన్ చేయించుకుంది తను. తద్వారా అతడిపై తనుకున్న అభిమానాన్ని చాటుకుంది ఒసాక. అంతేకాదు కోర్టులోకి రావడానికి ముందు ఐవెర్సన్ ఫొటో ముద్రించి ఉన్న షర్ట్‌ను ధరించిందీ టెన్నిస్ స్టార్. తన కొత్త స్టయిల్ గురించి అడుగగా.. 'నాకు ఐవెర్సన్ అంటే ఇష్టం. అతడు కూడా నాలానే రకరకాల ఫ్యాషన్‌లు ప్రయత్నించేవాడు. అతడు తన ఆటతో, స్టయిల్‌తో ఎన్‌బీయే ఆటగాళ్ల డ్రెస్‌ను మార్చేశాడు.

స్పోర్ట్స్‌లో క్రీడాకారుల దుస్తులపై సుదీర్ఘ చర్చలు జరుగుతాయని తెలుసు. మన గురించి మనం ఫ్యాషన్ ద్వారా తెలియజేయవచ్చు. ఆ విషయంలో ఐవెర్సన్‌ అద్భుతం' అని ఒసాక పేర్కొంది. తన స్టయిల్‌తో కోర్టులోకి వచ్చిన జషాన్ ప్లేయర్‌ను ఐమెర్సన్ అభినందించాడు. 'వావ్.. ఎంతగొప్ప గౌరవం. నువ్వు నాకు బిగ్ ఫ్యాన్. నిన్ను చూసేందుకు ఎదురుచూస్తున్నా' అతడు మెసేజ్ పంపాడు. ఇక తొలి రౌండ్‌లో జఖరోవాపై గెలుపొందిన ఒసాక రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది.

నిరుడు లబుబ్ డాల్స్‌తో..

గత ఏడాది కూడా యూఎస్ ఓపెన్‌లో 'లబుబ్ డాల్స్'తో నెట్టింట వైరలైన ఒసాక.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ (Australian Open)లో కూడా వినూత్న వేషధారణతో తళుక్కుమంది. తొలి రౌండ్ మ్యాచ్ కోసం కోర్టుకు ఆమె ఆక్వా బ్లూ(సుమద్రపు నీలిరంగు)టై డై ట్రాక్‌సూట్‌ జాకెట్.. దానికి మ్యాచింగ్‌గా తెల్లని పలోజాను పోలిన వెడల్పాటి ప్యాంట్ ధరించింది. ముఖాన్ని కవర్ దాదాపుగా కవర్ చేసేలా తెల్లని మేలి ముసుగు, తెల్లని టోపీ, చేతిలో తెలుపు రంగు గొడుకు పట్టుకొని ఫ్యాషన్ సుందరిలా నడుస్తూ కోర్టులోకి విచ్చేసింది ఒసాకా.

స్టయిల్ సింబల్‌గా పేరొందిన ఒసాకా 'ఆక్వా బ్లూ' అండ్ వైట్ లుక్‌లో కోర్టులోకి రావడం చూసి ప్రేక్షకులే కాదు కామెంటేటర్లు కూడా అవాక్కయ్యారు. తను అలా విభిన్న ష్యాషన్‌ను అనుసరించడం కొత్తేమీ కాదని తెలిసి.. 'వావ్.. నువ్వు ఎల్లప్పుడూ ప్రత్యేకంగా కనిపిస్తావు' అని అనుకున్నారు. కోర్టులో తన బెంచ్ వద్దకు చేరుకున్న ఒసాక.. ఛత్రీని, టోపీని తీసి పక్కన పెట్టింది. మేలి ముసుగును కూడా తీసేసి.. మ్యాచ్‌కు సిద్ధమైందీ ఆసియా సంచలనం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana